ఓటీటీలోకి వచ్చేస్తున్న 'నా సామిరంగ' మూవీ.. ఎక్కడంటే?
సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదలైన సినిమాలన్నీ వరుసగా ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి.
By Srikanth Gundamalla
ఓటీటీలోకి వచ్చేస్తున్న 'నా సామిరంగ' మూవీ.. ఎక్కడంటే?
సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదలైన సినిమాలన్నీ వరుసగా ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే విక్టరీ వెంకటేశ్ 'సైంధవ్', సూపర్‌స్టార్ మహేశ్‌బాబు గుంటూరుకారం సినిమాలు ఓటీటీల ద్వారా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చాయి. మరోసారి సినిమా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అయితే.. సంక్రాంతి పండుగకు మరో పెద్ద హీరో నాగార్జున నటించిన సినిమా 'నా సామిరంగ' కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ కూడా తాజాగా ఓటీటీ విడుదల తేదీని ఖరారు చేసుకుంది.
అక్కినేని నాగార్జున సంక్రాంతి సందర్భంగా 'నా సామిరంగ' అంటూ బరిలోకి దిగి హిట్ కొట్టారు. ఈ మూవీకి విజయ్ బిన్ని దర్శకత్వం వహించగా.. శ్రీనివాసా చిట్టూరి నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమా ద్వారా ఆశికా రంగనాథ్ హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఇక ఇదే మూవీలో మరో ఇద్దరు హీరోలు అల్లరి నరేశ్, రాజ్ తరుణ్‌లు కీలక పాత్రల్లో కనిపించారు. అంచనాలకు మంచి కలెక్షన్లు రాబట్టింది ఈ సినిమా. తద్వారా నాగార్జున తన కెరియర్‌లో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. కాగా.. సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలో మిస్ అయినవారు ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా..? ఎప్పుడు చూసేద్దామా? అని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ రిలీజ్‌పై ప్రకటన చేసింది. ఫిబ్రవరి 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారిక ప్రకటన చేసింది.
కాగా.. నా సామిరంగ మూవీ 'పొరింజు మరియమ్ జోస్' అనే మలయాళ సూపర్ హిట్ చిత్రానికి రీమేక్‌గా చిత్రీకరించారు. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 14న థియేటర్లలో విడుదలైంది. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా రూ.55 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు అంచానాలు ఉన్నాయి. కాగా.. తొలి మూడు రోజుల్లోనే రూ.28 కోట్లు వచ్చినట్లు నా సామిరంగ సినిమాకు రికార్డు ఉంది.
Just one more week until we get to see the King 👑 #NaaSaamiRangaonHotstar Streaming from 17th Feb only on #DisneyPlusHotstar@iamnagarjuna @allarinaresh @mmkeeravaani @vijaybinni4u @itsRajTarun @AshikaRanganath @mirnaaofficial @RuksharDhillon @actorshabeer @srinivasaaoffl… pic.twitter.com/b32dwWbrIH
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) February 10, 2024