Nagarjuna Bday: 'నా సామిరంగ' మాస్ లుక్ రిలీజ్
కింగ్ నాగార్జున బర్త్‌డే సందర్భంగా.. కొత్త సినిమా కబురు అందింది.
By Srikanth Gundamalla
Nagarjuna Bday: 'నా సామిరంగ' మాస్ లుక్ రిలీజ్
కింగ్ నాగార్జున బర్త్‌డే సందర్భంగా.. కొత్త సినిమా కబురు అందింది. ఈసారి మాస్ యాక్షన్ చిత్రంగా 'నా సామిరంగ' తెరకెక్కనుంది. ఈసారి నాగార్జున కొత్త దర్శకుడిని రంగంలోకి దింపారు. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ పాటలకు నృత్యాలను సమకూర్చిన విజయ్ బన్నీతో ఈ సినిమా చేస్తున్నారు నాగ్. మన్మథుడి పుట్టిన రోజు సందర్భంగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ముఖంపై ఒక వైపు రక్తం కారుతుండగా.. నాగార్జున నోట్లో సిగరెట్ వెలిగిస్తున్నారు. మాస్ లుక్‌లో కనిపిస్తున్న నాగ్ పోస్టర్ చూసిన అభిమానులు, నెటిజన్లు సూపర్బ్‌గా ఉన్నారంటూ కామెంట్స్ పెడుతున్నారు. కింగ్ నాగార్జున నుంచి మాస్ సినిమా కోసం ఎదురు చూస్తోన్న అక్కినేని ఫ్యాన్స్‌కు ఇదే పండగలా కనిపిస్తుంది.
'నా సామిరంగ' సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇక ఈ సినిమా పక్కా లోకల్ సెటప్‌తో తెరకెక్కబోతుందని టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. అంతేకాదు.. ఇదొక మలయాళ సూపర్ హిట్ సినిమా రీమేక్ అనే చర్చ కూడా నడుస్తోంది. అయితే.. విజయ్ బన్నీ తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా తీస్తారని తెలుస్తోంది. హీరో క్యారెక్టర్‌కు సమానంగా విలన్ క్యారెక్టర్ ఉండబోతుంట. దాంతో.. కొత్త విలన్‌ను ప్రేక్షకులకు పరిచయం చేయాలని చిత్ర యూనిట్ పరిశీలిస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం పలాస దర్శకుడు కరుణ కుమార్‌ను విలన్‌గా నటింపజేస్తారని తెలుస్తుంది. ఇదే గనుక నిజమైతే టాలీవుడ్‌కు మరో విలన్ పరిచయం కాబోతున్నట్లే. ఇక టైటిట్ గ్లింప్స్‌ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. యాక్షన్ సీన్లతో ఉన్న ఈ వీడియో అభిమానులను అలరించింది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఇక ఈ సారి పండక్కి నా సామిరంగా అంటూ నాగ్ చెప్పిన డైలాగ్.. సంక్రాంతి బరిలో దిగుతామంటూ క్లారిటీ ఇచ్చేసింది.
ఈ సినిమాను సంక్రాంతి బరిలో దింపాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ మేరకు షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ కూడా చేస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నాగార్జున సరసన కాజల్ ఫిక్స్ అయిపోయినట్లు సమాచారం అందుతోంది. ఈ సినిమాతో మాస్ కంబ్యాక్ ఇవ్వాలని కింగ్ నాగార్జున భావిస్తున్నారు.
Naa Saami Ranga🤟Ippudu #KingMassJataraమొదలు 🔥🔥Our next with the King 👑@iamnagarjuna garu titled #NaaSaamiRanga 💥World Wide Release on Sankranti 2024🤩Here's the Title Glimpse ➡️ https://t.co/0PuVDhdykA#HBDKingNagarjuna 🎊@ChoreographerVJ @mmkeeravaani… pic.twitter.com/5k88K8XNei
— Srinivasaa Silver Screen (@SS_Screens) August 29, 2023