క్షమించండి.. ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నా: నాగబాబు

నాగబాబు స్వయంగా స్పందించారు. తన కామెంట్స్‌ను వెనక్కి తీసుకుంటున్నాననీ.. క్షమాపణలు చెప్పారు.

By Srikanth Gundamalla  Published on  29 Feb 2024 3:01 PM IST
nagababu,  sorry,  twitter, varun tej, movies,

క్షమించండి.. ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నా: నాగబాబు 

వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన సినిమా 'ఆపరేషన్ వాలెంటైన్'. ఇటీవల ఈ మూవీకి సంబంధించి ప్రీరిలీజ్‌ ఫంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వరుణ్ తేజ్‌ తండ్రి నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవి కాస్త వైరల్ అయ్యాయి. కొందరు విమర్శలు కూడా చేశారు. దాంతో.. నాగబాబు స్వయంగా స్పందించారు. తన కామెంట్స్‌ను వెనక్కి తీసుకుంటున్నాననీ.. క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఒక పోస్టు కూడా పెట్టారు.

'ఆపరేషన్ వాలంటైన్‌' సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో పాల్గొన్న నాగబాబు మాట్లాడుతూ.. పోలీస్‌ పాత్ర 6 అడుగులు 3 అంగుళాలు ఉన్న వ్యక్తులు చేస్తే బాగుంటుందని చెప్పారు. అంతేకానీ.. 5 అడుగుల మూడు అంగుళాలు ఉండేవారు పోలీస్‌ క్యారెక్టర్‌ చేసే అంత బాగోదని అన్నారు. ఆ వ్యాఖ్యలు కాస్త వైరల్ అయ్యాయి. తాజాగా ఎక్స్‌ వేదికగా నాగాబాబు స్పందించి క్షమాపణలు చెప్పారు. ఆ మాటలనున వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎవరైనా తన కామెంట్స్‌తో నొచ్చుకుని ఉంటే క్షమించాలని కోరారు. యాదృచ్ఛికంగా వచ్చిన కామెంట్సే మాత్రమే కానీ.. ఎవరినీ ఉద్దేశించి చెప్పినవి కాదన్నారు.

అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు ఎక్స్‌ వేదికగా నాగబాబు రాసుకొచ్చారు. మరోవైపు నాగబాబు కామెంట్స్‌పై వరుణ్ తేజ్‌ కూడా స్పందించారు. ఎత్తుకు సంబంధించి తన తండ్రి చేసిన వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించినవి కావని పేర్కొన్నారు. తన హైట్‌ను దృష్టిలో పెట్ఓటుకుని చిన్న పోలిక చేశారనీ.. ఏ హీరోను కించపరిచే ఉద్దేశం లేదని వరుణ్ తేజ్‌ చెప్పారు. వరుణ్‌ తేజ్‌ శక్తి ప్రసాద్‌ సింగ్‌ హడా డైరెక్షన్‌లో 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమాలో నటించారు. 2019లో జరిగిన పుల్వాడా దాడి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. మార్చి 1న తెలుగు, హిందీలో విడుదల కానుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా రుహానీ శర్మ నటించగా.. నవదీప్‌ కీలక పాత్ర పోషించారు.


Next Story