సమంత నటించిన వెబ్‌సిరీస్ ఇష్టమని చెప్పిన నాగచైతన్య
అక్కినేని నాగచైతన్య తాజాగా దూత అనే వెబ్‌సిరీస్‌లో నటించాడు.
By Srikanth Gundamalla Published on 29 Nov 2023 12:05 PM ISTసమంత నటించిన వెబ్‌సిరీస్ ఇష్టమని చెప్పిన నాగచైతన్య
అక్కినేని నాగచైతన్య తాజాగా దూత అనే వెబ్‌సిరీస్‌లో నటించాడు. ఈ సిరీస్ ఈ డిసెంబర్ 1వ తేదీ నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. నాగచైతన్య ఈ వెబ్‌సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడారు. ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఆసక్తికర కామెంట్స్ చేశాడు. మొదటిసారిగా వెబ్‌సిరీస్‌లో నటించారనీ.. అయితే మీకు ఏ వెబ్‌సిరీస్ అంటే బాగా ఇష్టం అని అడిగ్గా.. దానికి నాగచైతన్య ది ఫ్యామిలీ మ్యాన్ తన ఫేవరెట్ సిరీస్ అని చెప్పాడు. ఆ సిరీస్ తనకు ఎంతగానో నచ్చిందని పేర్కొన్నారు. కాగా.. ఫ్యామిలీ మెన్ సెకండ్ సీజన్‌లో సమంత కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.
నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుని చాలా కాలం అవుతోంది. ఫ్యామిలీ మెన్ సిరీస్‌లో నటించిన తర్వాత కొన్నాళ్లే ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే.. ఈ సిరీస్‌లో ఆమె బోల్డ్‌గా కనిపించింది. విడాకులకు ఈ సిరీస్ కూడా ఒక కారణం అయ్యిందనే రూమర్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైతూ తన ఫేవరెట్ వెబ్ సిరీస్ ద ఫ్యామిలీ మెన్ అని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఫ్యామిలీ మెన్ సిరీస్‌లో మనోజ్ భాజ్‌పాయ్, ప్రియమణి, శరద్ కేల్కర్, నీరజ్ మాధవ్, షరీబ్ హష్మీ, దలీప్ తాహిల్, సన్నీ హిందూజ, శ్రేయ ధన్వంతరి పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.
ఇకపోతే నాగచైతన్య ప్రస్తుతం తండేల్ అనే సినిమా చేస్తున్నాడు. ఇది వాస్తవ సంఘటనల ఆధారంగా మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన దాదాపు 25 మంది మత్స్యకారులు బతుకుతెరువు కోసం గుజరాత్ తీర ప్రాంతంలోని వీరవల్ వద్ద చేపల వేట కొనసాగిస్తూ .. 2018 నవంబర్‌లో పొరపాటున పాకిస్తాన్ సముద్ర తీర అధికారులకు బందీలుగా చిక్కారు. అక్కడే ఏడాదిన్నరపాటు బందీలుగా ఉండాల్సి వచ్చింది. వారి జీవితాలను ఆధారంగా తీసుకునే ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు.