మల్టీప్లెక్సుల్లో టికెట్ 99 రూపాయలే.. కానీ ఆ ఒక్కరోజే..!

మల్టీప్లెక్స్‌ అసోసియేష్ ఆఫ్‌ ఇండియా సినీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్ చెప్పింది.

By Srikanth Gundamalla  Published on  21 Sept 2023 5:52 PM IST
Multiplex, Tickets Rate,  Rs.99,  National Cinema Day,

మల్టీప్లెక్సుల్లో టికెట్ 99 రూపాయలే.. కానీ ఆ ఒక్కరోజే..!

మల్టీప్లెక్సుల్లో సినిమాకు వెళ్తే డబ్బులు కాస్త ఎక్కువే ఖర్చు అవుతుంది. ఈ క్రమంలో మల్టీప్లెక్స్‌ అసోసియేష్ ఆఫ్‌ ఇండియా సినీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్ చెప్పింది. మల్టీప్లెక్సుల్లో టికెట్‌ ధరను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అయితే.. అది ఒక్కరోజు మాత్రమేనట.

మల్టీప్లెక్సుల్లో కేవలం 99 రూపాయలకే టికెట్‌ను విక్రయిస్తున్నట్లు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. అక్టోబర్ 13న 'నేషనల్‌ సినిమా డే' సందర్భంగా ఈ ఆఫర్‌ను అమలు చేయనున్నారు. పీవీఆర్‌ ఐనాక్స్‌, సినీ పోలిస్‌, మిరాజ్‌, సిటీప్రైడ్‌, ఏషియన్‌, మూవీ టైమ్‌, వేవ్‌, ఎమ్‌2కే, డిలైట్‌ సహా 4వేలకు పైగా థియేటర్లలో రూ.99కే సినిమాలను ప్రదర్శించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ఒక్క రోజే ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. ఇక మరిన్ని వివరాలు తెలుసుకోవాలని అనుకుంటే మల్టీప్లెక్స్‌ వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. అయితే..ఆయా మల్టీప్లెక్సుల్లో నేరుగా టికెట్లు తీసుకుంటే రూ.99కే టికెట్‌ లభిస్తుందని.. ఆన్‌లైన్‌లో అయితే అదనపు చార్జీలు వర్తిస్తాయని తెలుస్తోంది. రిక్లెయినర్స్‌, ప్రీమియం ఫార్మాట్స్‌కు ఈ ఆఫర్‌ వర్తించదు.

గతేడాది సెప్టెంబర్ 23న నేషనల్ సినిమా డే సెలబ్రేషన్స్‌ను ఎం.ఎ.ఐ. నిర్వహించింది. అప్పుడు ఒక్కరోజే 6.5 మిలియన్లకు పైగా ప్రేక్షకులు సినిమాలను మల్టీప్లెక్సుల్లో వీక్షించారు. తొలిసారి సెలబ్రేషన్స్‌ సందర్భంగా ప్రకటించిన ఆఫర్ విజయవంతం కావడంతో.. మరోసారి ఇదే చేస్తోంది ఎం.ఎ.ఐ. అయితే.. కొవిడ్‌ రెండు వేవ్‌ల తర్వాత భారత్‌లో పూర్తిస్థాయిలో థియేటర్లు తెరచుకున్న రోజు కావడంతో సెప్టెంబరు 16ను సినిమా డేగా ప్రకటించి అనివార్యకారణాలతో సెప్టెంబరు 23కి వాయిదా వేశారు. ఇప్పుడు అక్టోబరు 13ని ఎంపిక చేశారు. కాగా.. త్వరలో విడుదల కానున్న చిత్ర బృందాలకు ఈ ఆఫర్‌ కలిసి వస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తదితర చిత్రాలు సెప్టెంబరు 28న పలు సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. వాటిల్లో.. రామ్‌ నటించిన 'స్కంద', లారెన్స్‌ 'చంద్రముఖి-2', ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ సినిమాలు ఉన్నాయి. ఆ తర్వత అక్టోబర్ 6న ‘పెదకాపు 1’ కిరణ్‌ అబ్బవరం ‘రూల్స్‌ రంజన్‌’ సినిమాలు విడుదల అవుతాయి.

Next Story