రామ్‌చరణ్‌ కూతురికి ముకేశ్‌ అంబాని స్పెషల్‌ గిఫ్ట్‌

రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్‌ అంబానీ మెగా ప్రిన్సెస్‌కు ఒక స్పెషల్‌ కాస్ట్‌లీ గిఫ్ట్‌ పంపారు.

By Srikanth Gundamalla  Published on  30 Jun 2023 9:33 AM IST
Ramcharan, Upasana, Mega Princes, Mukesh Ambani

రామ్‌చరణ్‌ కూతురికి ముకేశ్‌ అంబాని స్పెషల్‌ గిఫ్ట్‌

మెగా పవర్‌ స్టార్‌ టాలీవుడ్‌ ద్వారా పరిచయమై.. తన రేంజ్‌ను పెంచుకుంటూ పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. అంతేకాదు.. గ్లోబల్‌ స్టార్‌ అని కూడా పిలుస్తుంటారు ఆయన అభిమానులు. జూన్‌ 20న రామ్‌చరణ్‌-ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. దీంతో.. మెగా ఫ్యామిలీలో సంబరాలు మిన్నంటాయి. మెగా ప్రిన్సెస్‌ వచ్చిందంటూ అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. జూన్‌ 20న తెల్లవారుజామున 1:49 గంటలకు మెగా ప్రిన్సెస్‌ ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. పాప పుట్టిన రెండ్రోజుల పాటు అభిమానులు, సెలబ్రిటీల నుంచి చరణ్ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సోషల్‌ మీడియాలోనూ రెండ్రోజులు మెగా ప్రిన్సెస్‌ హవానే కనిపించింది. దేశవ్యాప్తంగా ఈ న్యూస్‌ ట్రెండ్‌ అయ్యింది. అయితే.. మరోసారి మెగా ప్రిన్సెస్‌ గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముకేశ్‌ అంబానీ చరణ్‌ కూతురికి స్పెషల్‌ గిఫ్ట్‌ పంపారు.

రామ్‌చరణ్‌-ఉపాసన దంపతుల ముద్దుల కూతురు మెగా ప్రిన్సెస్‌కు సెలబ్రిటీల నుంచి ఆశీర్వాదాలతో పాటు బహుమతులు కూడా అందుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచ కుబురేల్లో ఒకరైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్‌ అంబానీ ఒక స్పెషల్‌ కాస్ట్‌లీ గిఫ్ట్‌ పంపారు. ఇప్పుడీ వార్త దేశవ్యాప్తంగా సెన్సేషన్‌ అవుతోంది. మెగా ప్రిన్సెస్‌కు అంబాని బంగారు ఊయల బహుమతిగా పంపారట. ఆయన పంపిన ఊయల 2 కేజీలకు పైగా బంగారంతో తయారు చేయించారని వార్తలు వినిపిస్తున్నాయి. బంగారు ఊయల కోసం రూ.1.20 కోట్లు వరకు ఖర్చు చేశారని చెబుతున్నారు. మెగా ప్రిన్సెస్‌కు జూన్ 30న బారసాల కార్యక్రమం నిర్వహిస్తారు. ఇరు కుటుంబాల సభ్యులతో పాటు సన్నిహితులను మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానించారని తెలుస్తోంది. మెగా ప్రిన్సెస్‌ బారసాల సందర్భంగానే ముకేశ్‌ అంబాని బంగారపు ఊయల పంపించినట్లు తెలుస్తోంది.

Next Story