పెళ్లి చేసుకున్న నాగిణీ ఫేమ్ బ్యూటీ

Mouni Roy Marries Suraj Nambiar.బాలీవుడ్ నటి, నాగిణీ ఫేమ్ 'మౌని రాయ్' ఈరోజు గోవాలో సూరజ్ నంబియార్‌ను వివాహం

By M.S.R  Published on  27 Jan 2022 6:49 AM GMT
పెళ్లి చేసుకున్న నాగిణీ ఫేమ్ బ్యూటీ

బాలీవుడ్ నటి, నాగిణీ ఫేమ్ 'మౌని రాయ్' ఈరోజు గోవాలో సూరజ్ నంబియార్‌ను వివాహం చేసుకున్నారు. ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిన్ననే ప్రారంభమయ్యాయి. మౌని రాయ్ వధువుగా ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. గాయకుడు మన్మీత్ సింగ్ ఈ ఫోటోలను పంచుకున్నారు. పెళ్లికి, మౌని రాయ్ ఎరుపు మరియు బంగారు ఎంబ్రాయిడరీతో కూడిన తెల్లటి చీర, కాంట్రాస్ట్ రెడ్ బ్లౌజ్‌ని ఎంచుకున్నారు. తన ఆభరణాల విషయంలో మౌని దక్షిణ భారత సంప్రదాయ ఆభరణాలను ఎంచుకుంది.

మౌని రాయ్ ఫ్యాన్ పేజీలు ఆమె వివాహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను పంచుకున్నాయి. పెళ్లికి, మౌని తెల్లటి చీరను ఎంచుకుంటే, సూరజ్ లేత గోధుమరంగు కుర్తా, తెలుపు ధోతీలో కనిపించాడు. వారి వివాహ వేడుకకు సంబంధించిన వీడియో కూడా వెబ్‌లో వైరల్‌గా మారింది. మౌని రాయ్, సూరజ్ నంబియార్ వారి వివాహానికి మలయాళీ, బెంగాలీ వివాహ సంప్రదాయాలను అనుసరించారు. మౌని రాయ్, సూరజ్ నంబియార్ వివాహానికి మందిరా బేడీ, ఆష్కా గోరాడియా, అర్జున్ బిజ్లానీలతో సహా పలువురు ప్రముఖులు గోవాలో ఉన్నారు. మౌని రాయ్, సూరజ్ నంబియార్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటూ ఉన్నారు. ఈరోజు వారు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

Next Story
Share it