ఆదిపురుష్‌ మూవీ ప్రదర్శిస్తోన్న థియేటర్లోకి వానరం.. వీడియో వైరల్

ఆదిపురుష్‌ సినిమా ప్రదర్విస్తోన్న ఓ థియేటర్లోకి అనుకోకుండా వానరం ప్రవేశించింది. ఇది చూసిన ప్రేక్షకులంతా ఒక్కసారిగా

By Srikanth Gundamalla  Published on  16 Jun 2023 11:23 AM IST
Adipurush, Prabhas, Movie, Kritisanan, Om Rout, Theatre

 ఆదిపురుష్‌ మూవీ ప్రదర్శిస్తోన్న థియేటర్లోకి వానరం.. వీడియో వైరల్

ఆదిపురుష్‌ సినిమా ప్రదర్విస్తోన్న ఓ థియేటర్లోకి అనుకోకుండా వానరం ప్రవేశించింది. ఇది చూసిన ప్రేక్షకులంతా ఒక్కసారిగా జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

'ఆగమనం.. అధర్మ విధ్వంసం' అంటూ రాముడిగా ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఎంతోకాలంగా వెయిట్‌ చేస్తోన్న సినిమా థియేటర్లలోకి రావడంతో అభిమానులంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. సినిమాహాళ్ల దగ్గర సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ థియేటర్‌లో జరిగిన సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆదిపురుష్‌ సినిమా ప్రదర్శితమవుతోన్న థియేటర్లోకి అనుకోకుండా వానరం ఎంట్రీ ఇచ్చింది. ఆదిపురుష్‌ సినిమా ఆడుతోన్న ప్రతి థియేటర్లో ఒక సీటుని ఆంజనేయుడి కోసం ఖాళీగా ఉంచాలని చిత్ర బృందం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రామాయణ పారాయణ జరిగే ప్రతిచోటుకి హనుమాన్ వస్తాడని నమ్ముతారు. ఈ క్రమంలోనే ప్రతి థియేటర్లో ఒక సీటు ఖాళీగా ఉంచుతోంది చిత్రబృందం. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఆదిపురుష్‌ చిత్ర ప్రదర్శిస్తోన్న థియేటర్లోకి అనుకోకుండా వానరం వచ్చింది. అక్కడే గోడపై కూర్చొని కాసేపు సినిమాను చూసింది. దీన్ని చూసిన ప్రేక్షకులంతా కేకలు వేశారు. జైశ్రీరామ్ జైశ్రీరామ్‌ అంటూ నినాదాలు చేశారు. కొందరు వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం అదే వీడియో వైరల్‌ అవుతోంది. దీన్నిచూసిన కొందరు హనుమంతుడే వచ్చి సినిమా చూశాడని.. ఇదొక అద్భుతమంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. వీడియోకు లైక్స్‌ కొడుతూ షేర్‌ చేస్తున్నారు.

ఓం రౌత్‌ డైరెక్షన్‌లో భారీ బడ్జెట్‌తో ఆదిపురుష్‌ ఇప్పటికే హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. రామాయణానికి టెక్నాలజీని జోడించి రూపొందించడంతో అందరినీ ఆకట్టుకుంటోంది. రాఘవుడిగా ప్రభాస్‌ కనిపించగా.. జానకిగా కృతి సన్‌ నటించారు. ఇక రావణుడి పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ నటించారు.

Next Story