న‌టి దారుణ హ‌త్య‌.. గోనే సంచిలో మృత‌దేహాం

Missing Bangladeshi actress Raima Islam Shimu's dead body found in sack.దారుణమైన పరిస్థితుల్లో నటి

By M.S.R  Published on  19 Jan 2022 5:39 AM GMT
న‌టి దారుణ హ‌త్య‌.. గోనే సంచిలో మృత‌దేహాం

దారుణమైన పరిస్థితుల్లో నటి మృతదేహం కనిపించడంతో కలకలం మొదలైంది. బంగ్లాదేశ్ నటి రైమా ఇస్లాం షిము మృతదేహం సోమవారం నాడు గోనె సంచిలో లభ్యమైంది. ఆమె మృతదేహం ఢాకాలోని కెరానిగంజ్ వంతెన సమీపంలో లభ్యమైంది. మృతదేహాన్ని కొందరు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. నటి శరీరంపై చాలా గాయాల గుర్తులు కూడా కనిపించాయని తెలుస్తోంది. ఆదివారం నాడు ఆమెను హత్య చేసి మృతదేహాన్ని వంతెన సమీపంలో పడేసి ఉంటారని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ చేయగా ఆమె భర్త ఈ దారుణానికి పాల్పడ్డట్లు తేలింది.

పోలీసులు అసహజ మరణం కింద కేసును నమోదు చేశారు. నటి హత్యకు సంబంధించి విచారణ కోసం ఆమె భర్త షాఖావత్ అలీ నోబెల్, ఆమె డ్రైవర్‌ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. చాలా రోజులుగా తన భార్య కనిపించడం లేదని షిమూ భర్త ఆదివారం కలాబగన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత మృతదేహం లభించడం.. ఆమె భర్తనే హత్య కేసులో తన ప్రమేయాన్ని అంగీకరించడంతో పోలీసు అధికారులు కూడా షాకయ్యారు. దీంతో అతడిని మూడు రోజుల రిమాండ్‌కు తరలించారు.

షిమూ హత్యకు కుటుంబ కలహాలే కారణమై ఉండవచ్చని భవిస్తూ ఉన్నారు. షిము భర్త నోబెల్ మరియు అతని స్నేహితులలో ఒకరైన అబ్దుల్లా ఫర్హాద్‌లను తదుపరి విచారణ కోసం అదుపులోకి తీసుకున్నట్లు కెరానిగంజ్ పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఒక ప్రముఖ నటుడి ప్రమేయం ఉన్నట్లు పలు మీడియా సంస్థలు ఆరోపణలు గుప్పించాయి, అయితే పోలీసులు ఇప్పటి వరకు దేనినీ ధృవీకరించలేదు.

Next Story
Share it