బాక్సాఫీస్‌ వద్ద 'సలార్' సెగలు రేపింది: మెగాస్టార్ చిరంజీవి

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటించిన కొత్త సినిమా 'సలార్'. డిసెంబర్‌ 22న థియేటర్లలో విడుదల అయ్యింది.

By Srikanth Gundamalla  Published on  23 Dec 2023 6:09 AM
megastar chiranjeevi, tweet,  salaar movie,

బాక్సాఫీస్‌ వద్ద 'సలార్' సెగలు రేపింది: మెగాస్టార్ చిరంజీవి

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటించిన కొత్త సినిమా 'సలార్'. డిసెంబర్‌ 22న థియేటర్లలో విడుదల అయ్యింది. వరల్డ్‌ వైడ్‌గా విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బాస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్లను తిరగరాస్తోంది. తొలిరోజే రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టిందని తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. రెండు పార్టులుగా వస్తోంది ఈ సినిమా. తొలి పార్ట్‌లో ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, హై టెక్నికల్ వాల్యూస్, అద్భుతమైన స్క్రీన్‌ ప్రెజెన్స్‌కు సినీ ప్రేక్షకులంతా ఫిదా అవుతున్నారు. తాజాగా ఇదే సినిమాపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సలార్‌ సెగలు పుట్టిస్తోందంటూ ప్రశంసలు కురిపించారు.

ప్రభాస్‌ సలార్‌ సినిమా గురించి మెగాస్టార్ ఎక్స్‌ (ట్విట్టర్‌)వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా సలార్‌ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్‌ చేసిన మెగాస్టార్ చిరంజీవి.. 'మైడియర్ దేవా ప్రభాస్‌కు హార్దిక అభినందనలు. సలార్‌ బాక్సాఫీస్‌ వద్ద సెగలు రేపింది. అద్భుత విజయం సాధించిన దర్శకుడు ప్రశాంత్‌నీల్‌కు అభినందనలు, ప్రపంచ నిర్మాణంలో మీరు రాణిస్తారు. పృథ్వి, శృతిహాసన్, జగపతిబాబు, చిత్ర యూనిట్‌ భువన్‌ గౌడ్, రవి బస్రూర్‌, వీసీ చలపతి, నిర్మాత కిరగండూర్‌కు అభినందనలు' అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ఆయనే ఒక్కరే కాదు.. సలార్ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఈసారి ప్రభాస్‌ కటౌట్‌కు తగ్గ హిట్‌ పడిందంటూ చెబుతున్నారు. ఇక ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు మాత్రం ఈ సినిమా ఒక పండగలా మారింది.

కాగా.. సలార్‌లో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా శృతిహాసన్ కనిపించింది. ముఖ్యపాత్రల్లో పృథ్విరాజ్‌ సుకుమారన్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడంతో పాటు ఇతర భాషల్లో ఈ సలార్‌ మూవీ విడుదలైంది.


Next Story