మెగాస్టార్ తో వినాయక్ 'విశ్వాసం'

Megastar Chiranjeevi to do Ajith's Viswasam remake with VV Vinayak.మెగాస్టార్ చిరంజీవి మరో తమిళ రీమేక్ కి ఓకే చెప్పారు.

By Sumanth Varma k  Published on  20 Jan 2023 9:49 AM IST
మెగాస్టార్ తో వినాయక్  విశ్వాసం

మెగాస్టార్ చిరంజీవి మరో తమిళ రీమేక్ కి ఓకే చెప్పారు. తమిళ బ్లాక్ బస్టర్ 'విశ్వాసం' సినిమాను తెలుగులో రీమేక్‌ చేయబోతున్నారు చిరు. 2019లో విడుదలైన ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా నటించారు. పైగా ఈ విశ్వాసం తెలుగులోనూ రిలీజ్ అయ్యింది. టీవీలలో కూడా చాలాసార్లు ప్రసారం అయ్యింది. అయినా చిరు ఈ సినిమాని రీమేక్ చేస్తుండటం విశేషం. చిరంజీవితో గతంలో ఠాగూర్ వంటి సూపర్ హిట్ ని, ఆ తర్వాత ఖైదీ నెంబర్ 150 వంటి మరో బ్లాక్ బస్టర్ ని ఇచ్చిన వివి వినాయిక్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు.

ఈ సినిమా కథ పై ఇప్పటికే వినాయక్ మార్పులు చేర్పులు చేశాడట. ఆ మార్పులు చిరుకి బాగా నచ్చాయని, అందుకే.. మెగాస్టార్ వెంటనే ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ప్రస్తుతం 'వాల్తేరు వీరయ్య' సక్సెస్‌ జోష్ లో ఉన్నారు చిరు. బాక్సాఫీస్‌ ను మరోసారి దున్నేస్తున్న క్రమంలో మెగాస్టార్ ఈ రీమేక్ ప్రాజెక్టుకు ఓకే చెప్పారు. ఐతే, చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న 'భోళా శంకర్' సినిమా కూడా రీమేక్ సినిమానే. అజిత్ 'వేదాళం' సినిమాకి తెలుగు రీమేక్ గా 'భోళా శంకర్ వస్తోంది. మళ్లీ అజిత్ సినిమానే చిరు రీమేక్ చేస్తుండటం విశేషం.

Next Story