మంచి ఘడియల్లో పాప పుట్టింది.. జాతకం బాగుంది: చిరంజీవి (వీడియో)

రామ్‌చరణ్‌, ఉపాసన తల్లిదండ్రులు కావాలని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నట్లు చిరంజీవి తెలిపారు. ఆ కల భగవంతుని దయ..

By Srikanth Gundamalla
Published on : 20 Jun 2023 1:34 PM IST

Chiranjeevi, granddaughter, Ramcharan, Upasana, Littile Princes

మంచిఘడియల్లో పాప పుట్టింది.. జాతకం బాగుంది: చిరంజీవి (వీడియో)

రామ్‌చరణ్‌ ఉపాసన తల్లిదండ్రులు కావడం ఎంతో సంతోషంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. మీడియా సమావేశంలో మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడుతూ..చరణ్‌ దంపతులు ఆడబిడ్డకు జన్మనివ్వడంతో ఇంట్లో అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. రామ్‌చరణ్‌, ఉపాసన తల్లిదండ్రులు కావాలని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఆ కల భగవంతుని దయ, అందరి ఆశీస్సుల వల్ల సాధ్యమైందని చెప్పుకొచ్చారు మెగాస్టార్‌ చిరంజీవి. తమ కుటుంబానికి శుభాకాంక్షలు చెబుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు.

జూన్‌ 20న ఉదయం 1:49 గంటలకు రామ్‌చరణ్‌ ఉపాసన దంపతులకు ఆడబిడ్డ పుట్టింది. మంగళవారం మంచి ఘడియలని.. ఆంజేయస్వామికి చాలా కీలకమని అన్నారు. ఆయన్ని నమ్ముకున్న తమ కుటుంబంలో ఆడబిడ్డ పుట్టడం అపురూపంగా భావిస్తున్నామని చిరంజీవి అన్నారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. కొన్ని రోజులుగా మెగా ఇంట అన్ని శుభకార్యాలు జరుగుతుండటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇటీవల వరుణ్‌ తేజ్‌ ఎంగేజ్‌మెంట్‌.. ఇవాళ ఉపాసన ఆడబిడ్డకు జన్మనివ్వడం వరుస శుభకార్యాలు జరిగాయని చెప్పారు. మనవరాలికి ఎవరి పోలికలు వచ్చాయని కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.. దానికి చిరంజీవి తాను ఇప్పుడే చెప్పలేనన్నారు. పాపను చూశాను కానీ ఇప్పుడే తెలియదని పేర్కొన్నారు. కాగా.. ఉదయమే లిటిల్‌ మెగా ప్రిన్సెస్‌కు స్వాగతమంటూ చిరంజీవి ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే.

Next Story