హీరోయిజం గురించి మెగాస్టార్ ఆసక్తికర కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హీరోయిజం అంటే ఏంటనే విషయం చెప్పారు.
By Srikanth Gundamalla Published on 13 Oct 2023 11:11 AM GMTహీరోయిజం గురించి మెగాస్టార్ ఆసక్తికర కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్. ఆయన్ని చూసే చాలా మంది నటులు సినిమాల్లోకి వచ్చారు. ఇప్పుడు సినిమాల్లో నటిస్తున్నారు కూడా. చిరంజీవి మెగాస్టార్ స్థాయి వరకు ఎదిగేందుకు ఎంతో కష్టపడ్డారు. తాజాగా.. చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హీరోయిజం అంటే ఏంటనే విషయం చెప్పారు. సినిమాల్లో ఎంతో కష్టపడి ఒళ్లు హూనం చేసుకుంటేనే తనకు తృప్తి అంటుందని హీరోయిజం గురించి చెప్పారు. ప్రస్తుతం చిరంజీవి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మనిషి జీవితంలో ముందుకు సాగేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలని అన్నారు చిరు. తాను కూడా అలాగే కష్టపడి డ్యాన్స్‌లు.. ఫైట్లు చేయాలని అనుకుంటానని అన్నారు. నడుచుకుంటూ వెళ్లి కూడా సూపర్ హిట్‌లు సొంతం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు మెగాస్టార్. హాయిగా సెట్‌కు వెళ్లి మేకప్ వేసుకుని నటించి.. వాళ్లు ఇచ్చిన డబ్బులు తీసుకుని జేబులో పెట్టేసుకుని వస్తే బాగుటుందని.. కానీ అలాంటి పరిస్థితి మనది కాదన్నారు చిరంజీవి. నిజంగానే ఫైట్లు చేయాలని.. ఒళ్లు హూనం చేసుకోవాలని అన్నారు. అలా చేయకపోతే దర్శక-నిర్మాతలకు, సినిమా చూసే ప్రేక్షకులకు తృప్తి ఉండదని అన్నారు. అలాగే కష్టపడకపోతే తనకూ తృప్తి ఉండదని మెగాస్టార్ అన్నారు.
యంగ్ హీరోలకు పోటీగా మెగాస్టార్ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం మెగాస్టార్ సినిమాలు రెండు లైనప్‌లో ఉన్నాయి. బింబిసార సినిమా డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీని ప్రీప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. ఈ సినిమా గురించి ఇటీవల మాట్లాడిన డైరెక్టర్.. త్వరలో అందరినీ సినిమాటిక్ అడ్వెంచర్‌లోకి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సోషియే ఫాంటసీ కథతో ముందుకు రానున్నట్లు చెప్పారు. ఇక చిరు మరో సినిమా 'గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్'పై ఒకటి చేస్తున్నారు. ఈ మూవీకి కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారని సమాచారం.