గిన్నిస్ రికార్డు సాధించిన మెగాస్టార్‌ చిరంజీవి.. ఎందులో అంటే..

మెగాస్టార్ చిరంజీవి అంటే యాక్షన్..డ్యాన్స్. ఎలాంటి సినీ నేపథ్యంలో లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

By Srikanth Gundamalla  Published on  22 Sep 2024 12:54 PM GMT
గిన్నిస్ రికార్డు సాధించిన మెగాస్టార్‌ చిరంజీవి.. ఎందులో అంటే..

మెగాస్టార్ చిరంజీవి అంటే యాక్షన్..డ్యాన్స్. ఎలాంటి సినీ నేపథ్యంలో లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. స్వయంకృషితో మెగాస్టార్‌ స్థాయి వరకు ఎదిగారు. చిరంజీవి స్ఫూర్తిగానే ఇండస్ట్రీలోకి ఎంతో మంది వచ్చారు. 46ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో స్టార్‌గా కొనసాగుతున్న మెగాస్టార్‌ చిరంజీవి.. తాజాగా మరో రికార్డును అందుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ఇప్పటి వరకు 155 సినిమాలు చేసిన విషయం తెలిసిందే. ఫైట్లు, యాక్షన్‌, డ్యాన్సు, స్టైల్‌లో ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. కెరీర్‌లో చిరంజీవి ఇప్పటి వరకు ఎన్నో ఘనతలు, అవార్డులు దక్కించుకున్నారు. నటనతోపాటు ఆయన బాడీలో డ్యాన్స్‌, ఆ డ్యాన్సుల్లో గ్రేస్‌, రిథమ్‌ కూడా కారణం అని చెప్పవచ్చు. ఇప్పుడు ఆ డ్యాన్సులు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లోకి ఎక్కేలా చేశాయి. చిరంజీవి 150కు పైగా సినిమాలు చేశారు. మెగాస్టార్‌ చిరంజీవి డ్యాన్స్‌కు గిన్నిస్‌ బుక్‌ ఫిదా అయ్యింది. 156 సినిమాల్లో 537 పాటల్లో, 24000 మూమెంట్స్ వేసిన అరుదైన నటుడిగా చిరంజీవి గిన్నిస్ రికార్డ్ సొంతం చేసుకున్నారు.


Next Story