అత్యవసరం అయితేనే బయటకు రండి.. చిరంజీవి కీలక సూచన
వర్షాలు, వరదల నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాల ప్రజలకు కీలక సూచనలు చేశారు.
By Srikanth Gundamalla Published on 1 Sept 2024 11:37 AM ISTతెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో.. వరదలు పోటెత్తుతున్నాయి. ఈ సందర్భంగా పలు చోట్ల వరదల కారణంగా ప్రజలు ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. ప్రాణనష్టం సంభవిస్తోంది. ఆయా కుటుంబాల్లో విషాదచాయలు అలుముకుంటున్నాయి. వర్షాలు, వరదలపై ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యి చర్యలు తీసుకుంటోంది కూడా. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాయి. మరో రెండు,మూడు రోజులు ఇదే పరిస్థితి ఉన్న నేపథ్యంలో నగరం, గ్రామాల్లో అన్ని ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఎక్కడ ఏ ఇబ్బంది తలెత్తినవెంటనే రంగంలోకి దిగి రక్షిస్తున్నారు. వర్షాలు, వరదల నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాల ప్రజలకు కీలక సూచనలు చేశారు.
ప్రజాక్షేమం కోసం మెగాస్టార్ చిరంజీవి కీలక సూచన చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏపీ, తెలంగాణలో వరద ప్రభావం తీవ్రంగా ఉందని ఈ మేరకు పేర్కొన్నారు. గ్రామాలు, రహదారులు నీట మునిగిపోయి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఇలాంటి పరిస్తితుల నేపథ్యంలో ప్రజలు అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని మెగాస్టార్ చిరంజీవి సూచించారు. మీ కుటుంబ సభ్యుడిగా మనవి చేసుకుంటున్నా అంటూ చెప్పారు. ఇంటి బయటకు వస్తే ప్రమాదంలో పడినట్లే అవుతుందన్నారు. మరో వైపు విషజ్వరాలు కూడా విజృంభిస్తున్న క్రమంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. క్షేమంగా ఉండాలని కోరారు. ఇలాంటి విపత్తుల సమయంలో ప్రజలకు, బాధితులకు తన అభిమానులు అండగా ఉంటున్నారనీ.. ఇప్పుడు కూడా అలానే చేస్తారని ఆశిస్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పలు గ్రామాలు, జాతీయ రహదారులు నీటితో మునిగిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 1, 2024
మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే... అత్యవసరం అయితే తప్ప ఎవరు ఇంటి నుంచి బయటకు రావద్దు. వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉండటం…