Mega 157: చిరంజీవికి జోడీగా ఐశ్వర్యరాయ్..!
మెగాస్టార్ చిరంజీవి 157వ సినిమాలో ఐశ్వర్యరాయ్ నటించనున్నారని ప్రచారం జరుగుతోంది.
By Srikanth Gundamalla Published on 21 Sept 2023 2:45 PM ISTMega 157: చిరంజీవికి జోడీగా ఐశ్వర్యరాయ్..!
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. యువ హీరోలు కొందరు ఏడాదికి ఒక్కసినిమాతోనే సరిపెట్టుకుంటే.. సీనియర్ హీరోగా ఉన్న చిరు మాత్రం 2023లో ఏకంగా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలతో అలరించారు. ఈ మూవీస్ తర్వత మరో సినిమాను పట్టాలెక్కించే పనిలో పడ్డారు మెగాస్టార్. చిరంజీవి 157 సినిమాలో ముగ్గురు స్టార్ హీరోయిన్లు కనిపిస్తారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ ముగ్గురు హీరోయిన్లు వీరేనంటూ సోషల్ మీడియాలో వార్తల చక్కర్లు కొడుతున్నాయి.
కాగా మెగాస్టార్ చిరంజీవి 156వ సినిమాకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి, సుస్మిత కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తోంది. 157వ సినిమాకూ మెగాస్టార్ సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు బింబిసార దర్శకుడు వశిష్ట డైరెక్టర్‌గా వ్యవహరించబోతున్నారు. 157వ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వేగంగా సాగుతోంది. ఇటీవల మెగాస్టార్‌ను కలిసి ప్రాజెక్టు స్టేటస్ గురించి యూనిట్ చర్చించడం తెలిసిందే. ఈ సినిమా కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగే కథ. ఈ మూవీ కోసం భారీగా ఖర్చు చేయనున్నట్లు సమాచారం. నటీనటుల ఎంపిక కూడా పాన్ ఇండియా స్థాయిలో ఉండనుందని తెలుస్తోంది. ఇప్పటికే ముగ్గురు కథానాయికలకు ఛాన్స్ ఉంటూనిదాని చెప్పారు. ఒక హీరోయిన్‌గా అనుష్క పేరు వినించగా.. మరో కథోనాయికగా మృణాల్ ఠాకూర్ పేరు వినిపించింది. తాజాగా ఐశ్వర్యరాయ్ పేరు తెరమీదకు వచ్చింది. చిత్ర యూనిట్ ఐశ్వర్యరాయ్‌ని సంప్రదించడం.. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందని అంటున్నారు. చిరు 157వ సినిమాలో ఐశ్వర్యరాయ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ఇప్పటి వరకు తెలుగులో ఒకే ఒక సినిమాలో నాగార్జునతో ఒక స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. ఈ సినిమాలో పాత్ర బలంగా ఉండటం, చిరంజీవితో కలిసి నటించాలనే కోరికతో ఒప్పుకున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.