ఇన్‌స్టాగ్రామ్‌లో మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ పోస్టు
టాలీవుడ్‌లో సీనియర్ రైటర్ సత్యానంద్‌ను అభినందిస్తూ మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ పోస్టు పెట్టారు.
By Srikanth Gundamalla Published on 5 Oct 2023 1:12 PM ISTఇన్‌స్టాగ్రామ్‌లో మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ పోస్టు
మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా లో ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. టాలీవుడ్‌లో సీనియర్ రైటర్ సత్యానంద్‌ను అభినందిస్తూ మెగాస్టార్ చిరంజీవి ఆ పోస్టు పెట్టారు. తనకు అత్యంత ఆప్తుడు, ఎన్నో విజయవంతమైన సినిమాలకు స్క్రిప్ట్ సమకూర్చిన సత్యానంద్ అంటూ మెగాస్టార్ రాసుకొచ్చారు.
సత్యానంద్ సినిమా రంగంలో 50 వసంతాలు పూర్తిచేసుకున్నారని ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు. ఈ యాభై ఏళ్ల ప్రస్థానంలో పదునైన డైలాగ్స్ రాసి.. నేటి రచయితలకు, దర్శకులకు, నటులకు ఒక మెంటర్‌గా వ్యవహరిస్తున్నారని రైటర్ సత్యానంద్‌ను కొనియాడారు చిరంజీవి. ఈ సందర్భంగా సత్యానంద్‌కు హృదయపూర్వక ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. సినిమాను ప్రేమిస్తూ.. సినిమానే ఆస్వాదిస్తూ.. సినిమాను తన జీవిత విధనంగా మలుచుకున్న వ్యక్తి నిత్య సినీ విద్యార్థి అని పొగిడారు. తరతరాల సినీ ప్రముఖులందరికీ ప్రియమితులు.. తనకు అత్యంత ఆప్తులు, మృదు భాషి అంటూ రైటర్ సత్యానంద్ గురించి రాసుకొచ్చారు. అయితే.. మెగాస్టార్ చిరంజీవి జీవితంలో సత్యానంద్ పాత్ర కూడా ఉంది. ఈ క్రమంలోనే సత్యానంద్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ.. మరో 50 ఏళ్లు ఇదే ఎనర్జీతో ఉండాలని కోరుకుంటున్నట్లు మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ పోస్టు పెట్టారు.
ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు తదితర పెద్ద హీరోల సినిమాలకు సత్యానంద్ రైటర్‌గా పనిచేశారు. దాదాపు 400కు పైగా సినిమాలకు రైటర్‌గా పనిచేశారు. ముఖ్యంగా చిరంజీవితో కొండవీటి సింహం, యముడికి మొగుడు, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, అంజి చిత్రాలకు కథను సమకూర్చారు. అంతేకాదు మహేశ్‌బాబు టక్కరి దొంగ సినిమాకు కూడా కథను సమకూర్చారు. ఇక నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయనా, రవిబాబు ఆవిరి సినిమాలకు స్క్రీన్‌ప్లే అందించారు సత్యానంద్.