రామ్‌చరణ్-ఉపాసన దంపతుల కూతురు పేరు ఇదే..

బారసాల కార్యక్రమంలోనే మెగాప్రిన్సెస్‌కు పేరు పెట్టారు.

By Srikanth Gundamalla
Published on : 30 Jun 2023 4:56 PM IST

Klin Kaara Konidela, Ramcharan, Chiranjeevi, Upasana

 రామ్‌చరణ్-ఉపాసన దంపతుల కూతురు పేరు ఇదే..

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, ఉపాసన దంపతుల కూతురు బారసాల వేడుక ఘనంగా జరిగింది. అయితే.. మెగా ప్రిన్సెస్‌కు ఏం పేరు పెడతారా అని అందరూ ఉత్కంఠగా చూశారు. పాపకు ఏం పేరు పెట్టాలనేది ముందుగానే నిర్ణయించుకున్నామని ఇప్పటికే రామ్‌చరణ్, ఉపాసన దంపతులు చెప్పిన విషయం తెలిసిందే. బారసాల కార్యక్రమంలోనే మెగాప్రిన్సెస్‌కు పేరు పెట్టారు. మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన కోడలు ఉపాసన తమ ట్విట్టర్‌ అకౌంట్లో పాప పేరుని షేర్‌ చేశారు.

తమ కూతురికి 'క్లిం కారా కొణిదెల' (Klin Kaara Konidela) అని నామకరణం చేశారు రామ్‌చరణ్‌-ఉపాసన దంపతులు. తాతయ్య, నానమ్మ చిరంజీవి, సురేఖ దంపతులు చిన్నారి పేరుని చెవిలో చెప్పారు. ఈ విషయాన్ని చిరంజీవి, ఉపాసన అభిమానులు, సన్నిహితులతో పంచుకున్నారు. లలితా సహస్ర నామం నుంచి ఈ పేరుని ఎంపిక చేసుకుని నామకరణం చేసినట్లు పేర్కొన్నారు. జూన్‌ 20వ తేదీన పండంటి బిడ్డకు ఉపాసన జన్మనిచ్చిన విషయం తెలిసిందే. మెగా ప్రిన్సెస్‌కు క్లిం కారా అని పేరు పెట్టడంతో.. బాగుంది.. కొత్తగా ఉందంటూ నెటిజన్లు, అభిమానులు కామెంట్స్‌ పెడుతున్నారు.



Next Story