వివాదంలో సాయిధరమ్ తేజ్.. హారతి ఇవ్వడంపై విమర్శలు
మెగా హీరో సాయిధరమ్ తేజ్ వివాదంలో చిక్కుకున్నాడు.
By Srikanth Gundamalla
వివాదంలో సాయిధరమ్ తేజ్.. హారతి ఇవ్వడంపై విమర్శలు
మెగా హీరో సాయిధరమ్ తేజ్ వివాదంలో చిక్కుకున్నాడు. శ్రీకాళహస్తిలో సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకున్నాడు సాయిధరమ్ తేజ్. ఈ సందర్భంగా స్వామివారికి స్వయంగా సాయిధరమ్ తేజ్ హారతి ఇచ్చాడు. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్చకులు లేకపోవడంతో సాయిధరమ్ తేజ్ హారతి ఇచ్చాడు. కానీ అదే వివాదానికి దారి తీసింది. సుబ్రహ్మణ్యస్వామికి పూజారులు తప్ప మరెవరూ హారతి ఇవ్వొద్దని భక్తులు మండిపడుతున్నారు. హారతి ఇచ్చేందుకు ఆలయ అధికారులు ఎలా అనుమతి ఇచ్చారంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు.
సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమా ఇటీవల విడుదలపై హిట్ కొట్టింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేశారు. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం తన మేనమామ పవన్ కళ్యాణ్‌తో కలిసి 'బ్రో' సినిమాలో నటిస్తున్నాడు. బ్రో సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
కాగా.. విరూపాక్షకు ముందు సాయిధరమ్ తేజ్ రోడ్డుప్రమాదానికి గురయిన విషయం తెలిసిందే. తీవ్రగాయాల పాలై చికిత్స తర్వాత కోలుకున్నాడు. ప్రస్తుతం ఆలయాలను తిరుగుతూ దేవుళ్లకు ప్రత్యేక పూజలు చేస్తున్నాడు. కాణిపాక వినాయక స్వామిని దర్శించుకున్న తర్వాత.. సాయిధరమ్ తేజ్ శ్రీకాళహస్తికి చేరుకున్నాడు. అక్కడ నుంచి కడప దర్గాలో ప్రత్యేక ప్రార్థనల చేశాడు. సాయిధరమ్ తేజ్ వస్తుండటంతో ఈ వార్త తెలిసిన మెగా అభిమానులు ఆయా ఆలయాలకు పెద్ద ఎత్తున వెళ్లారు.
తనకు ఇది పునర్జన్మ అని.. దేవుడు ప్రసాదించాడని సాయిధరమ్ తేజ్ ఆలయాలను సందర్శించిన సందర్భంగా చెప్పాడు. పెద్ద ప్రమాదం నుంచి బయటపడి కోలుకున్నందుకే ఆలయాలను సందర్శిస్తున్నట్లు చెప్పాడు సాయిధరమ్ తేజ్. ఇక బ్రో సినిమాలో మామయ్య పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించడం మర్చిపోలేని అనుభూతి అని తెలిపారు. పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పాడు. అంతా బాగానే జరిగినా.. సాయిధరమ్ తేజ్ శ్రీకాళహస్తిలో సుబ్రహ్మణ్యస్వామికి స్వయంగా హారతి ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. కాగా.. దీనిపై ఆయన ఇంకా స్పందించలేదు.
వివాదంలో సినీ నటుడు సాయిధరమ్ తేజ్శ్రీకాళహస్తిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి హారతి ఇచ్చిన సాయిధరమ్ తేజ్. పూజారులు తప్ప మరి ఎవ్వరు ఇవ్వకూడదు అంటు భక్తులు ఆగ్రహాం. ఎలా అనుమతి ఇచ్చారు అంటూ ఆలయ అధికారులు పై భక్తులు అసహనం. పట్టించుకొని ఆలయ అధికారులు మరియు సిబ్బంది.#SaiDharamTej pic.twitter.com/lOEDUxJxHU
— Telugu Scribe (@TeluguScribe) July 15, 2023