సంక్రాంతి సంబరాల్లో మెగా ఫ్యామిలీ.. దోసెలు వేసిన రామ్‌చరణ్‌

సంక్రాంతి పండగ సంబరాల్లో భాగంగా మెగా ఫ్యామిలీ అంతా బెంగళూరుకు వెళ్లింది.

By Srikanth Gundamalla  Published on  14 Jan 2024 4:21 PM IST
mega family, pongal celebrations, ram charan ,

సంక్రాంతి సంబరాల్లో మెగా ఫ్యామిలీ.. దోసెలు వేసిన రామ్‌చరణ్‌

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ శోభ నెలకొంది. సంక్రాంతి పండగ కోసం ప్రజలంతా స్వగ్రామాలకు వెళ్లడంతో ఊళ్లలో సందడి వాతావరణం నెలకొంది. సామాన్య ప్రజలే కాదు.. ఇటు సెలబ్రిటీలు కూడా ఈ పండుగను వైభవంగా నిర్వహించుకుంటున్నారు. సెలబ్రిటీలు అంటే ముఖ్యంగా మెగా ఫ్యామిలీ గురించి చెప్పాలి. ఈ ఫ్యామిలీ నుంచే చాలా మంది హీరోలు ఉన్నారు. ఒకేసారి అందరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఆ కిక్కే వేరు. తాజాగా సంక్రాంతి పండగ సంబరాల్లో భాగంగా మెగా ఫ్యామిలీ అంతా బెంగళూరుకు వెళ్లింది. అక్కడ వారంతా ఎంజాయ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం మెగా ఫ్యామిలీకి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


సంక్రాంతి సంబరాలను మెగా కుటుంబం అంతా బెంగళూరులో ఘనంగా నిర్వహించుకుంటోంది. ఈ సంక్రాంతి పండుల వారికి ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే మెగాస్టార్‌ మనుమరాలు క్లీంకారాతో పాటు.. మెగా కుటుంబంలో కొత్త కోడలు లావణ్య త్రిపాఠి అడుగుపెట్టింది. వారి ఎంట్రీ తర్వాత తొలిసారి వచ్చిన సంక్రాంతి కావడంతో.. మరింత గ్రాండ్‌గా చేస్తున్నారు ఈ పండుగను. ఇప్పటికే బెంగళూరులోని ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో ఉదయం అల్లు అర్జున్. స్నేహారెడ్డి కూడా బెంగళూరుకు వెళ్లారు. వారు ఎయిర్‌పోర్టు వద్ద కనిపించడంతో కొందరు అభిమానులు వారిని చూసి ఫొటోలు తీసుకున్నారు. ఆ ఫోటోలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.






మెగా కుటుంబంలోని స్టార్స్ అంతా భోగి పండగ వేడుకలను ఎంతో వైభవంగా జరుపుకున్నారు. ఇందులో రామ్‌చరణ్‌, వరుణ్‌తేజ్, సాయిధరమ్‌ తేజ్, వైష్ణవ్‌ తేజ్, అల్లు శిరీష్ పాల్గొన్నారు. వీరికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలు వైరల్ అవుతున్నాయి. రామ్‌చరణ్‌ ఏకంగా చెఫ్‌ అవతారం ఎత్తారు. తన కుటుంబ సభ్యుల కోసం దోసెలు వేస్తూ కనిపించారు. రకరకాల ఫుడ్‌ ఐటమ్స్‌ను వండుకుంటున్నారు. ఇక మెగా ఫ్యామిలీ కొత్త కోడలు తన అత్తవారింటి కోసం స్వీట్‌ సున్నండలు కూడా చేసింది.

Next Story