రికార్డులు బ్రేక్ చేస్తున్న మాస్ట‌ర్ టీజ‌ర్‌

Master - Official Teaser .. ఇళ‌య‌ దళపతి విజయ్ పేరుకు పరిచయం అక్కర్లేదు. ఆయ‌న‌కు రికార్డులు కొత్తేమీ కాదు.

By సుభాష్  Published on  27 Nov 2020 2:36 PM GMT
రికార్డులు బ్రేక్ చేస్తున్న మాస్ట‌ర్ టీజ‌ర్‌

ఇళ‌య‌ దళపతి విజయ్ పేరుకు పరిచయం అక్కర్లేదు. ఆయ‌న‌కు రికార్డులు కొత్తేమీ కాదు. ఆయ‌న ప్ర‌తి సినిమా ఏదో ఒక రికార్డును క్రియేట్ చేస్తూనే ఉంటుంది. ఇటీవల విజయ్‌ నటించిన మాస్టర్ సినిమా టీజర్ యూట్యూబ్‌లో రికార్డుల మోత మోగిస్తోంది. విడుదలైన రెండు వారాలలోపే 40 మిలియన్ల వ్యూస్ సాధించింది కొత్త రికార్డ్ సెట్ చేసింది. అంతే కాకుండా 2.4 మిలియ‌న్ లైక్స్‌తో మన దక్షిణాదిలో హైయెస్ట్ లైక్డ్ టీజర్ గా కూడా సెన్సేషనల్ రికార్దును అందుకుంది.

లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్ర టీజ‌ర్‌ను ఈ నెల 14 న నిర్మాతలు విడుదల చేశారు. ఇక అప్పటి నుంచి అన్ని వర్గాల ప్రేక్షకులు, విమర్శకుల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. టీజర్ హిట్ కావడంతో విజయ్‌ అభిమానులు పొంగల్‌ పండగను ముందే జరుపుకుంటున్నారు. వారు నిన్నటి నుంచి మాస్టర్ టీజర్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. మాస్ట‌ర్ హ‌వా చూస్తుంటే ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేయ‌డం ప‌క్కా అని తెలుస్తుంది.

విజయ్‌ ఈ చిత్రంలో కాలేజీ ప్రొఫెసర్ పాత్రలో ప్రేక్షుకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి సంగీతం అనిరుద్ అందివ్వగా విలన్ రోల్ లో టాలెంటెడ్ హీరో విజయ్ సేతుపతి నటించాడు. విజ‌య్ స‌ర‌స‌న మాళవిక మోహనన్ నటించింది. ఎప్పుడో విడుద‌ల కావ‌ల‌సిన ఈ చిత్రం క‌రోనా వ‌ల‌న ఆగింది. పొంగల్ సందర్భంగా జనవరి 14 న విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. విజయ్ తన 65 వ చిత్రం ప్రి ప్రొడక్షన్ పనులను ప్రారంభించాడు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్నఈ చిత్రం ఫిబ్రవరి 2021 లో మాస్టర్ విడుదల అనంతరం సెట్స్‌ పైకి వెళ్లే అవకాశం ఉంది.

Next Story