ప్రకాశ్ రాజ్‌ చేత జైశ్రీరామ్ అని కూడా పలికిస్తా: మంచు విష్ణు

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అంశం ఇటు టాలీవుడ్‌లోనూ విమర్శలకు తావిచ్చింది. ఇ

By Srikanth Gundamalla  Published on  29 Sept 2024 6:00 PM IST
ప్రకాశ్ రాజ్‌ చేత జైశ్రీరామ్ అని కూడా పలికిస్తా: మంచు విష్ణు

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అంశం ఇటు టాలీవుడ్‌లోనూ విమర్శలకు తావిచ్చింది. ఇటీవల ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు, ప్రకాశ్‌ రాజ్‌ మధ్య సోషల్‌ మీడియాలో మాట యుద్ధం జరిగింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంపై ఇటీవల ప్రకాశ్‌రాజ్‌ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ట్వీట్‌ను ఉద్దేశించి ‘‘మీరు ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. విచారించి నేరస్థులపై చర్యలు తీసుకోండి. మీరెందుకు అనవసర భయాలను కల్పించి, దీన్ని జాతీయస్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు. మనదేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తలు చాలు’’ అని పేర్కొన్నారు.. దీనిపై విష్ణు స్పందిస్తూ ‘‘మీ పరిధిలో మీరు ఉండండి’’ అని రిప్లై ఇచ్చారు మంచు విష్ణు. దీంతో వీరిద్దరి మధ్య చర్చ నడిచింది.

తాజాగా ఈ వివాదంపై మంచు విష్ణు మాట్లాడారు. అది పూర్తిగా ఆయన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. ఇక తాను తన అభిప్రాయాన్ని తెలియజేశానని అన్నారు. ఆయన వ్యాఖ్యలు కరెక్ట్‌ కాదని చెప్పాననీ.. నాన్న నటించిన చాలా సినిమాల్లో ఆయన యాక్ట్‌ చేశారని గుర్తు చేశారు. ఎంతోకాలం నుంచి ప్రకాశ్ రాజ్ తెలుసన్నారు మంచు విష్ణు. ఎంతో గౌరవం ఉందీ... ఎలాంటి కాంట్రవర్సీ లేదఅని విష్ణు అన్నారు. నటీనటులు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడతారని అన్నారు. ఈ వివాదంపై బహిరంగంగా మాట్లాడితే ఎవరి మనోభావాలు దెబ్బ తింటాయేమోనని భయంగా ఉందని మంచు విష్ణు వ్యాఖ్యానించారు. ప్రకాష్‌ రాజ్‌ దేవుడిని నమ్ముతారో లేదో తనకు తెలియదు కానీ.. ఆయన చేత శివయ్య అని పలికించానని వ్యాఖ్యానించారు. అలాగే జై శ్రీరామ్‌ అని కూడా చెప్పిస్తాను అని మంచు విష్ణు చెప్పారు.

Next Story