మంచు వారి ఇంట సందడి.. తండ్రైన మనోజ్

హీరో మంచు మనోజ్‌ తండ్రి అయ్యారని.. మౌనికారెడ్డి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారని మంచు లక్ష్మీ ఎక్స్‌ వేదికగా తెలిపారు.

By Srikanth Gundamalla  Published on  13 April 2024 2:30 PM IST
manchu manoj,   baby girl, mounika reddy, manchu laxmi,

 మంచు వారి ఇంట సందడి.. తండ్రైన మనోజ్

మంచు మనోజ్‌ వారి ఇంట సందడి మొదలైంది. ఏడాది క్రితం మంచు మనోజ్‌ రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన సతీమణి మౌనికారెడ్డికి కూడా అది రెండో వివాహమే. అయితే.. తాజాగా హీరో మంచు మనోజ్‌ తండ్రి అయ్యారని.. మౌనికారెడ్డి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారని మంచు లక్ష్మీ ఎక్స్‌ వేదికగా వెల్లడించింది.

ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టిన మంచు లక్ష్మీ.. భగవంతుడి ఆశీస్సులతో మా ఇంట్లో చిన్నారి దేవత అడుగుపెట్టిందని రాసుకొచ్చింది. మనోజ్, మౌనిక ఆనందంగా త పాపను ఈ భూమి మీదకు ఆహ్వానించారని తెలిపింది. ఆ పాపను తాము ప్రేమగా 'ఎంఎం పులి' అని పిలుస్తున్నట్లు చెప్పింది మంచు లక్ష్మీ. ఆ శివుడి ఆశీస్సులు తమ కుటుంబంపై ఉండాలనీ.. అందరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరకుంటున్నట్లు ఎక్స్‌ వేదికగా మంచు లక్ష్మి రాసుకొచ్చారు. ఇక ఇదే పోస్టును మంచు మనోజ్ కూడా రీపోస్టు చేశారు. తండ్రి అయిన సందర్భంగా మంచు మనోజ్‌కు పలువురు నెటిజన్లు, అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు.

కాగా.. మంచు మనోజ్‌ సినిమాల విషయానికి వస్తే.. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో మంచు మనోజ్, మౌనిక రెడ్డి గతేడాది మార్చిలో వివాహం చేసుకున్నారు. పెద్దలంతా హాజరయి.. వారికి కంగ్రాట్స్ తెలిపారు. ఇక పెళ్లి తర్వాత కొన్నాళ్లుగా మనోజ్‌ నటనకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ హీరో 'వాట్‌ ది ఫిష్‌' సినిమా కోసం సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. వరుణ్‌ కోరుకొండ ఈ మూవీని డైరెక్టర్ చేయనున్నారు. ఈ సినిమాలో నిహారిక కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

Next Story