ఎన్టీఆర్ 'దేవర' సినిమాలో ఆ పాత్రలో మంచు లక్ష్మీ..!
దేవర సినిమాలో మంచు లక్ష్మి కీలక పాత్రలో కనిపించనున్నారని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.
By Srikanth Gundamalla Published on 29 Oct 2023 3:00 PM ISTఎన్టీఆర్ 'దేవర' సినిమాలో ఆ పాత్రలో మంచు లక్ష్మీ..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా నటిస్తోన్న సినిమా 'దేవర'పై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. దేవర సినిమాకు సంబంధించి పలు లీకులు మరింత హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇప్పటి వరకు చూడని యాక్షన్ సీన్లు దేవర చిత్ర యూనిట్ డిజైన్ చేస్తోందని తెలుస్తోంది. తారక్ కూడా ఆ ఫైట్ సీన్ల కోసం ప్రత్యేక శిక్షణ పొందుతున్నారని సమాచారం. దాంతో.. ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులే కాదు.. సినిమా ప్రేక్షకులు కూడా అంచనాలు భారీగానే పెట్టుకున్నారు. మరోవైపు అండర్ వాటర్ సీన్ మరో అద్బుతం అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ సీన్ సిల్వర్ స్క్రీన్‌పై వచ్చినప్పుడు ఎవరూ సీట్లలో కూర్చోరట.
ఈ నేపథ్యంలో దేవర సినిమా షూటింగ్‌ను కూడా యూనిట్ శరవేగంగా కొనసాగిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్‌ను ప్లాన్ చేసుకుంటూ స్పీడ్‌తో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాను ఊపేస్తుంది. దేవర సినిమాలో మంచు లక్ష్మి కీలక పాత్రలో కనిపించనున్నారని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. దేవరలో ఎన్టీఆర్‌కు మంచు లక్ష్మీ అక్కకగా నటిస్తున్నారని సమాచారం. అయితే.. ఆమె పాత్ర సినిమాను నడిపిస్తుందనే టాక్ కూడా నడుస్తోంది. ఈ రోల్ కోసం చిత్ర యూనిట్ మొదటగానే మంచు లక్ష్మిని సందర్శించారని.. అందుకు ఆమె ఒకే కూడా చెప్పారంటూ ప్రచారం జరుగుతోంది. భారీ అంచనాలున్న పాన్ ఇండియా మూవీలో కీలక పాత్రలో నటిస్తే మాత్రం మంచు లక్ష్మీకి మంచి అవకాశమే అని చెప్పాలి.
కాగా.. దేవర సినిమా సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతోంది. తారక్‌కు జోడీగా జాన్వీకపూర్ నటిస్తోంది. దేవర సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో కొనసాగుతోంది. ఈ మూవీలో విలన్‌గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు. ఈ సినిమాను యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా.. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న దేశ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.