రాజ్‌తరుణ్-లావణ్య ఎపిసోడ్‌పై స్పందించిన మాల్వీ మల్హోత్ర
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యారు.
By Srikanth Gundamalla Published on 11 July 2024 5:46 PM ISTరాజ్‌తరుణ్-లావణ్య ఎపిసోడ్‌పై స్పందించిన మాల్వీ మల్హోత్ర
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆయన పేరే ట్రెండ్ అవుతోంది. రాజ్‌తరుణ్ తనని మోసం చేశాడంటూ లావణ్య మీడియా ముందుకు వచ్చారు. పెళ్లి చేసుకుని విడిచిపెట్టారంటూ ఆరోపణలు చేసింది. అయితే..ఈ ఎపిసోడ్‌లో రాజ్‌తరుణ్ సినిమా 'తిరగబడర సామీ' సినిమాలో నటించిన బాలీవుడ్ నటి మాల్వీ మల్హోత్ర పేరు కూడా వినిపించింది.
తాజాగా ఈ వివాదంపై మాల్వి మల్హోత్ర స్పందించింది. నటుడు రాజ్ తరుణ్ జీవితంలో ఏం జరుగుతుందో తనకు తెలియదని అన్నారు. అది ఆయన పర్సనల్ విషయమని చెప్పారు. తిరగబడర సామి సినిమాలో రాజ్‌తరుణ్ తో కేవలం కలిసి నటించినట్లు చెప్పారు. అంతేతప్ప ఆయన వ్యక్తిగత జీవితం గురించి కొంచెం కూడా తెలుసుకోలేదని మాల్వి మల్హోత్ర చెప్పారు.
రాజ్ తరుణ్-లావణ్య అంశంలో మాల్వీ పేరు కూడా బయటకు వచ్చింది. 'తిరగబడర సామీ' సినిమా ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ అంశంపై ఈ ఆసక్తికర కామెంట్స్ చేశారు. రాజ్‌తరుణ్‌తో తాను మాట్లాడినట్లు లావణ్య ఆరోపణలు చేస్తోందనీ.. కానీ ఎప్పుడూ రాజ్‌తరుణ్‌తో పర్సనల్‌గా మాట్లాడలేదన్నారు. లావణ్య గురించి రాజ్ తరుణ్ గతంలో ఎప్పుడూ తనతో మాట్లాడలేదన్నారు.తనపై ఇలాంటి ఆరోపణలు వస్తాయని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి విమర్శలను స్వీకరిస్తామని... కానీ ఇలాంటి నెగిటివ్ కామెంట్ల గురించి అస్సలు పట్టించుకోనన్నారు మాల్వి మల్హోత్ర. తాను ప్రస్తుతం సింగిల్‌గా ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. తన దృష్టి అంతా కెరియర్‌పై మాత్రమే ఉందని స్పష్టం చేశారు.