నరేష్-పవిత్రల 'మళ్ళీ పెళ్లి' కి ముహూర్తం ఖరారు

Malli Pelli Movie Released On May 26th. నటుడు నరేష్- సీనియర్ నటి పవిత్ర చేసిన చిత్రం 'మళ్ళీ పెళ్లి'. ఎమ్ ఎస్ రాజు దర్శకత్వం వహించారు.

By M.S.R  Published on  3 May 2023 6:45 PM IST
నరేష్-పవిత్రల మళ్ళీ పెళ్లి కి ముహూర్తం ఖరారు

నటుడు నరేష్- సీనియర్ నటి పవిత్ర చేసిన చిత్రం 'మళ్ళీ పెళ్లి'. ఎమ్ ఎస్ రాజు దర్శకత్వం వహించారు. ఈ సినిమా యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. నటుడు నరేష్ జీవితంలో చోటు చేసుకున్న పరిణామాల సమాహారమే మళ్ళీ పెళ్లి మూవీ. నరేష్ మూడో వివాహంగా రమ్య రఘుపతిని చేసుకున్నారు. వీరికి ఒక అబ్బాయి ఉన్నారు. కొన్నేళ్ల క్రితం విభేదాలతో విడిపోయారు. గత కొన్ని సంవత్సరాలుగా నరేష్ నటి పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో రమ్య రఘుపతి పలుమార్లు నరేష్ మీద ఆరోపణలు చేశారు. దాడికి ప్రయత్నించారు. వీటన్నిటినీ మళ్ళీ పెళ్లి సినిమాలో చూపించి సంచలనానికి నాంది పలికారు నరేష్. ఈ సినిమాను మే 26న రిలీజ్‌ చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. నరేష్‌, పవిత్ర లోకేష్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో వనితా విజయ్‌ కుమార్‌ కీలకపాత్ర పోషిస్తుంది. ఎం.ఎస్‌.రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను విజయకృష్ణ మూవీస్‌ పతాకంపై నరేష్‌ స్వీయి నిర్మాణంలో రూపొందించాడు.


Next Story