ప్రియురాలిని పెళ్లాడిన టాలీవుడ్ కెమెడియన్

టాలీవుడ్‌ కమెడియన్, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ మహేశ్‌ విట్టా పెళ్లి ఘనంగా జరిగింది.

By Srikanth Gundamalla  Published on  5 Sept 2023 12:42 PM IST
Mahesh Vitta, Marriage, Tollywood Comedian,

ప్రియురాలిని పెళ్లాడిన టాలీవుడ్ కెమెడియన్ 

టాలీవుడ్‌ కెమెడియన్‌ మహేశ్‌ విట్టా అందరికీ తెలిసిన వ్యక్తే. ఆ మధ్య బిగ్‌బాస్‌లో కూడా కనిపించాడు. పలు సినిమాల్లో నటించి హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే.. తాజాగా మహేశ్ విట్టా ఓ ఇంటి వాడు అయ్యాడు. తాను ప్రేమించిన శ్రావణి రెడ్డితో కలిసి ఏడు అడుగులు వేశాడు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని హెల్త్ క్లబ్‌ ఫంక్షన్‌ హాల్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. పెళ్లికి సంబంధించిన ఫోటోలను మహేశ్ విట్టా సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. నూతన వధూవరులకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. కొందరైతే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావ్‌ బ్రో అంటూ కాంగ్రాట్స్ చెబుతున్నారు.

మహేశ్‌ విట్టా యూట్యూబర్‌గా కెరీర్‌ ప్రారంభించాడు. ఆ తర్వాత కొంతకాలానికే టెలివిజన్‌లో అడుగుపెట్టాడు. కొన్ని సినిమాల్లోనూ కనిపించాడు. ఆ తర్వాత బిగ్‌బాస్‌లో 60 రోజులకు పైగా ఉండి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మహేశ్ విట్టా. రాయలసీమ యాసతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు మహేశ్. పలు సినిమాల్లో కమెడియన్‌గా కనిపించి నటనలో ప్రూవ్‌ చేసుకున్నాడు. నాని హీరోగా తెరకెక్కిన ‘కృష్ణార్జున యుద్ధం’ అతడికి కమెడియన్‌గా మంచి పేరు తీసుకువచ్చింది. ఆ తర్వాత ‘శమంతకమణి’, ‘టాక్సీవాలా’, ‘చలో’, ‘కొండపొలం’, ‘అల్లుడు అదుర్స్‌’ వంటి సినిమాల్లో కనిపించాడు. ఇక మహేశ్‌ విట్టా పెళ్లికి బిగ్‌బాస్‌-3లో పాల్గొన్న పలువురు కంటెస్టెంట్లు హాజరుఅయ్యారు.

Next Story