ఫోన్‌పేలో మహేశ్‌బాబు వాయిస్‌.. 5 సెకన్ల కోసం భారీ పారితోషికం

కరోనా మహమ్మారి తర్వాత దేశంలో డిజిటల్‌ పేమెంట్స్‌ ఎక్కువ అయ్యాయి.

By Srikanth Gundamalla  Published on  24 Feb 2024 6:29 AM GMT
mahesh babu, voice,  phonepe, digital payments,

 ఫోన్‌పేలో మహేశ్‌బాబు వాయిస్‌.. 5 సెకన్ల కోసం భారీ పారితోషికం

కరోనా మహమ్మారి తర్వాత దేశంలో డిజిటల్‌ పేమెంట్స్‌ ఎక్కువ అయ్యాయి. అంతేకాదు.. డిజిటల్‌ పేమెంట్స్‌ చాలా సులభం కూడా కావడంతో జనాలకు బాగా అలవాటు అయిపోయింది. చిన్నచిన్న కిరాణాషాపుల్లో కూడా డిజిటల్‌ పేమెంట్స్ నడుస్తున్నాయి. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం చెల్లింపులు అందుబాటులో ఉన్నాయి. అయితే.. ఆన్‌లైన్‌ యూపీఐ చెల్లింపు సంస్థలు అన్ని వారి లావాదేవీల కోసం సొంత స్మార్ట్‌ స్పీకర్లను అందుబాటులోకి తెచ్చాయి. యూపీఐ ద్వారా స్కాన్‌ చేసి డబ్బులు సెండ్‌ చేస్తే చాలా.. రీసీవుడ్‌ అనే కంప్యూటరైజ్‌డ్ వాయిస్‌ వినిపిస్తుంది.

ఇలా యూపీఐ స్పీకర్లను ఇప్పటి వరకు మనం చాలా చూశాం. కంప్యూటర్‌ వాయిస్‌ వినిపించేది. అయితే.. తాజాగా ఫోన్‌పే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఫోన్‌పే ద్వారా స్పీకర్‌కు స్కాన్‌ చేసి డబ్బులు సెండ్‌ చేస్తే ఇక నుంచి టాలీవుడ్ సూపర్‌ స్టార్ మహేశ్‌బాబు వాయిస్‌ రానుంది. దీని కోసం మహేశ్‌బాబుతో ఫోన్‌పే ఒప్పందం చేసుకుంది. ఇక నుంచి ఫోన్‌పేలో చెల్లింపులు చేస్తే.. ఇప్పుడు 50 రూపాయలు ఫోన్‌పే ద్వారా వచ్చాయి. హ్యాట్సాఫ్‌ గురువుగారు అంటూ మహేశ్‌బాబు వాయిస్‌ వినిపిస్తుంది. అయితే.. మహేశ్‌బాబు ఇలా చెబుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హీరోలు ఇలా డిజిటల్‌ పేమెంట్స్‌ స్పీకర్లకు వాయిస్‌ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ కూడా ఇదే తరహాలో వాయిస్ అందించారు. ఆ తర్వాత వాయిస్‌ ఇచ్చిన హీరో మహేశ్‌ బాబే. అయితే.. 5 సెకన్ల పాటు ఉండే ఈ వాయిస్‌ కోసం.. ఫోన్‌పే మహేశ్‌బాబుకి భారీగా పారితోషికం సమర్పించుకుంది. 5 సెకన్ల కోసం ఏకంగా రూ.5 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. దాంతో.. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ మహేశ్‌బాబు క్రేజా మజాకా అంటున్నారు. కాగా.. మహేశ్‌బాబు గుంటూరుకారం సినిమా సంక్రాంతికి విడుదలై మంచి హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆయన రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు.


Next Story