పక్కపక్కనే కూర్చొని పేకాట ఆడిన పెద్దోడు, చిన్నోడు.. వైరల్ అవుతోన్న పిక్స్

మహేశ్‌బాబు, వెంకటేశ్‌ ఇద్దరూ కలిసి ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

By Srikanth Gundamalla  Published on  5 Nov 2023 2:15 PM IST
mahesh babu, venkatesh, playing cards, viral photos,

పక్కపక్కనే కూర్చొని పేకాట ఆడిన పెద్దోడు, చిన్నోడు.. వైరల్ అవుతోన్న పిక్స్

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, విక్టరీ వెంకటేశ్‌ గతంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అన్నదమ్ముల పాత్రలో కనిపించారు. ఆ క్యారెక్టర్స్‌కు ఇప్పటికీ జనాల్లో క్రేజ్‌ అలాగే ఉంది. పెద్దోడి పాత్రలో వెంకటేశ్ కనిపించగా.. ఆయనకు తమ్ముడి పాత్రలో చిన్నోడిగా మహేశ్‌ బాబు నటించారు. ఈ సినిమాలో మొత్తం ఇద్దరి పేర్లను పెద్దోడు, చిన్నోడుగానే పిలుస్తారు. అన్నదమ్ముల మధ్య బాండింగ్‌ను అద్భుతంగా చూపించారు. అయితే.. అప్పట్లో వీరు ఎంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేశారో.. తాజాగా వీరిద్దరూ కలిసి ఉన్న కొన్ని పిక్స్‌ అంతే సంచలనంగా మారాయి.

మహేశ్‌ బాబు, వెంకటేశ్‌ ఇద్దరూ ఓ ప్రయివేట్‌ పార్టీకి హాజరయ్యారు. అక్కడ వీరిద్దరూ కలిసి సరదాగా పక్కపక్కనే కూర్చొని పేకాట ఆడారు. అదే సమయంలో కొందరు ఫొటోలు తీసుకున్నారు. ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో దర్శనం ఇచ్చాయి. ఇంకేముందు పెద్దోడు.. చిన్నాడో కలిసి ఒకే ఫ్రేమ్‌లో చాలా కాలం తర్వాత కనిపించడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కాంబినేషన్‌ ఎంతో బావుందని.. మరోసారి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా గుర్తొస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోలకు లేక్స్‌ కొడుతూ.. షేర్‌ చేస్తున్నారు అభిమానులు.

ఇక ఈ పార్టీకి హాజరయ్యే కంటే ముందు జిగర్ తండా డబుల్ ఎక్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు విక్టరీ వెంకటేష్. అక్కడి నుంచి నేరుగా ఈ పార్టీకి హాజరైనట్లుగా తెలుస్తోంది. ఇక మహేష్ బాబుకి సంబంధించి ఈ పిక్‌తో పాటు.. ఆయన ప్రస్తుతం చేస్తోన్న ‘గుంటూరు కారం’ సినిమా నుండి ధమ్ మసాలా సాంగ్ ప్రోమోని వదలడంతో మహేష్ బాబు పేరు టాప్‌లో ట్రెండ్ అవుతోంది. గంటూరుకారం సినిమాను 2024 సంక్రాంతికి విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్ నటించిన ‘సైంధవ్’ సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకుని.. చిన్నోడికి పోటీగా సంక్రాంతికే వచ్చేందుకు సిద్ధమవుతోంది.

Next Story