మహేశ్, రాజమౌళి సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ!
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ సినిమా కన్ఫమ్ అయ్యింది.
By Srikanth Gundamalla Published on 25 March 2024 1:58 PM IST
మహేశ్, రాజమౌళి సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ!
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ సినిమా కన్ఫమ్ అయ్యింది. ఇదే విషయంపై రాజమౌళి స్వయంగా జపాన్‌లో ప్రకటన చేశారు. తన తర్వాతి ప్రాజెక్టు మహేశ్‌బాబుతో ఉండబోతుంది. ఈ మూవీ ప్రీప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని చెప్పాడు. దాంతో.. వీరి కాంబినేషన్‌లో వచ్చే సినిమాపై సినిమా ప్రేక్షకులంతా ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యింది. రెగ్యులర్ షూటింగ్ స్టార్ కానున్నట్లు సమాచారం. కాగా.. ఆఫ్రికన్ అడవుల అడ్వైంచర్ నేపథ్యంలో ఈ మూవీ ఉండబోతుందని గతంలోనే రాజమౌళి చెప్పారు.
ఇప్పటి వరకు అయితే.. హీరోను మాత్రమే అనుకున్నామనీ, హీరోయిన్‌తో పాటు ఇతర నటులపై ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు రాజమౌళి. కాగా.. ఈ క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్ ఎవరనే దానిపై ఒక వార్త వైరల్ అవుతోంది. మహేశ్‌బాబుకి జోడీగా బాలీవుడ్ హీరోయిన్‌ను ఎంపిక చేశారని సమాచారం. బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్ ఈ ప్రాజెక్టులో హీరోయిన్‌గా కనిపించే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ఇదే గనుక నిజమైతే మహేశ్ సరసన ఆలియా.. ఆ క్రేజే వేరంటున్నారు ఫ్యాన్స్. ఈ మూవీలో మహేశ్ ఇంటెన్స్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే జపాన్ అడవుల్లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడు సూపర్ స్టార్. మొన్నీమద్యే ఆయన చాలా కాలం తర్వాత ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లారు.
కాగా మరోవైపు ఆలియా భట్ రాజమౌళి డైరెక్షన్‌లో పనిచేసింది. ఆర్ఆర్ఆర్‌లో హీరోయిన్‌గా కనిపించింది. ఆలియా ఆ మూవీలో సీతపాత్రలో కనిపించింది. ఆ మూవీ ద్వారానే సౌత్ ప్రేక్షకులకు దగ్గరైంది.