'గుంటూరు కారం' సినిమా ఓటీటీ విడుదల తేదీ ఇదే..
గుంటూరుకారం సినిమా కూడా ఓటీటీలో విడుదల తేదీని ఖరారు చేసుకుంది.
By Srikanth Gundamalla Published on 4 Feb 2024 5:12 AM GMT'గుంటూరు కారం' సినిమా ఓటీటీ విడుదల తేదీ ఇదే..
సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో సినిమాలు సందడి చేశాయి. అయితే.. పండగ వేళ విడుదలైన అన్ని సినిమాలు దాదాపుగా మంచి కలెక్షన్లనే రాబట్టాయి. ముఖ్యంగా హనుమాన్ సినిమా మాత్రం ఓ రేంజ్‌లో కలెక్షన్లను రాబట్టింది. మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక మహేశ్‌బాబు సినిమా గుంటూరు కారం చాలా ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య విడుదలైంది. మొదట కొంతమేర మిక్స్‌డ్ టాక్ వచ్చినా కలెక్షన్లలో మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. మహేశ్ మేనియాను చూపించారు అభిమానులు. అయితే.. సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసిన సినిమాలు ఇప్పుడు ఓటీటీ బాటపడుతున్నాయి. వరుసగా ఈ సినిమాలు ప్రేక్షకులను ఓటీటీల ద్వారా అలరించబోతున్నాయి. ఇప్పటికే విక్టరీ వెంకటేశ్ సినిమా సైంధవ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు గుంటూరుకారం సినిమా కూడా ఓటీటీలో విడుదల తేదీని ఖరారు చేసుకుంది.
మహేశ్‌బాబు గుంటూరు కారం మూవీ నెట్‌ఫ్లిక్ వేదికగా స్ట్రీమింగ్ కాబోతుంది. తాజాగా ఓటీటీ విడుదల తేదీని ప్రకటించింది నెట్‌ఫ్లిక్స్. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఇన్‌స్ట్రాగ్రామ్ వేదికగా ఒక పోస్టు పెట్టింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు అధికారిక పోస్టర్ విడుదల చేసింది నెట్‌ఫ్లిక్స్. కాగా.. ఓటీటీలోకి మహేశ్ గుంటూరుకారం వస్తుండటంతో అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. రౌడీ రమణ వచ్చేస్తున్నాడ్రోయ్ అంటూ సంబరపడిపోతున్నారు. కాగా.. గుంటూరు కారం మూవీ జనవరి 12వ తేదీని థియేటర్లలో విడుదలైంది. చాలా కాలం తర్వాత మహేశ్‌బాబు ఫుల్ మాస్ లుక్‌లో కనిపించారు. కుర్చీ మడతపెట్టి సాంగ్‌లో అయితే మహేశ్‌బాబు వేసిన స్టెప్పులు అభిమానులను ఉర్రూతలూగించాయి. త్రివిక్రమ్ ఈ సినిమాకు దర్వకత్వం వహించారు. తమన్ సంగీతం అందించగా.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ సినిమాను నిర్మించారు. వారంలోనే ఈ మూవీ రూ.212 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.