మరోసారి మంచి మనసు చాటుకున్న సితార.. అనాథ పిల్లలకు..

మహేశ్‌బాబు కూతురు సితార అనాథ పిల్లలతో కలిసి కొంత సమయం గడిపారు.

By Srikanth Gundamalla  Published on  21 Jan 2024 4:30 PM IST
mahesh babu,  sitara, guntur karam movie, special show,

మరోసారి మంచి మనసు చాటుకున్న సితార.. అనాథ పిల్లలకు..

సూపర్‌ స్టార్ మహేశ్‌బాబు చాలా సేవాకార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. పిల్లల కోసం ఉచితంగా హార్ట్‌ ఆపరేషన్లు చేయించి ఎంతోమంది తల్లిదండ్రుల నవ్వులో కనిపిస్తారు. అంతేకాదు.. తన సొంత గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఇక ఆయన కుమార్తె సితార కూడా తండ్రి బాటలోనే నడుస్తోంది. కొన్ని నెలల క్రితం తన పుట్టినరోజు సందర్భంగా పేదింటి విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేసింది. వారిని తన ఇంటికి ఆహ్వానించి సరదాగా మాట్లాడి.. తర్వాత కేక్‌ కట్‌ చేసింది. ఇక ఓ యాడ్‌ ద్వారా వచ్చిన రెమ్యునరేషన్ మొత్తం ఒక చారిటీకి విరాళంగా ఇచ్చేసింది.

తాజాగా సితార అనాథ పిల్లలతో కలిసి కొంత సమయం గడిపారు. అంతేకాదు.. తన తండ్రి హీరో మహేశ్‌బాబు గుంటూరుకారం సినిమాను వారందరికీ చూపించారు. మొదటిరోజు గుంటూరు సినిమాపై మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చిన విషయం తెలిసిందే. కానీ వసూళ్లపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. తాజాగా ఈ సినిమాను హైదరాబాద్‌లోని ఏఎంబీ థియేటర్లో స్పెషల్‌ షో ఏర్పాటు చేసింది సితారా. ఏఎంబీలోని అత్యంత లగ్జరీ స్క్రీన్‌లో అనాథపిల్లలతో కలిసి సినిమా చూసింది. లగ్జరీ థియేటర్ అనుభూతిని అనాథ పిల్లలకు కల్పించింది సితార. ఆ తర్వాత వారితో ఫొటోలు దిగింది. కాసేపు ముచ్చటింది. సితార అనాథ పిల్లలతో కలిసి సినిమా చూసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సితార మంచి మనసును అందరూ పొగుడుతున్నారు. లగ్జరీ థియేటర్‌లో వారికి సినిమా చూపించడాన్ని ప్రశంసిస్తున్నారు.

ఇక గతంలో హీరోయిన్ సమంత కూడా హాయ్‌నాన్న చిత్రాన్ని అనాథ పిల్లలకు చూపించిన విషయం తెలిసిందే. వారి కోసం సామ్‌ ఒక స్పెషల్ స్క్రీన్‌ను బుక్‌ చేశారు. తాజాగా సితార కూడా గుంటూరు కారం సినిమా అనాథపిల్లలకు చూపించి నెటిజన్ల నుంచి అభినందనలు అందుకుంటోంది. తండ్రి లాగే కూతరు సితారది కూడా మంచి మనసు అంటూ పొగుడుతున్నారు అభిమానులు.


Next Story