'కుర్చీ మడతపెట్టి' పాటకు అదరగొట్టిన మహేశ్‌బాబు అన్న కూతురు
సంక్రాంతికి థియేటర్లలో విడుదలైన మహేశ్‌బాబు సినిమా 'గుంటూరు కారం' పెద్ద హిట్‌గా నిలించింది.
By Srikanth Gundamalla Published on 19 Feb 2024 12:41 PM IST'కుర్చీ మడతపెట్టి' పాటకు అదరగొట్టిన మహేశ్‌బాబు అన్న కూతురు
సంక్రాంతికి థియేటర్లలో విడుదలైన మహేశ్‌బాబు సినిమా 'గుంటూరు కారం' పెద్ద హిట్‌గా నిలించింది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. అయితే.. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ వేదికగా ప్రేక్షకులను మరోసారి అలరిస్తోన్న విషయం తెలిసిందే. కాగా.. గుంటూరుకారం సినిమా నుంచి వచ్చిన కుర్చీని మడతపెట్టి పాట ఒక ఊపుని ఊపేసింది. ప్రేక్షకులు తెగ రీల్స్ చేస్తున్నారు. మిలియన్స్ కొద్ది రీల్స్ వైరల్ అయ్యాయి. అయితే.. ఇదే పాటపై మహేశ్‌బాబు అన్న కూతురు భారతి కూడా కుర్చీని మడతపెట్టి సాంగ్‌కు రీల్ చేసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇరగదీసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఘట్టమనేని భారతి తన బాబయ్ మహేశ్‌బాబు నటించిన గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతపెట్టి సాంగ్‌కు స్టెప్పులేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇంతకుముందు ఇదే పాటపై మహేశ్ కూతురు సితార కూడా రీల్ చేసింది. అప్పుడు సితార స్టెప్స్ కూడా ఆడియెన్స్‌కు తెగ నచ్చేశాయి. మిలియన్స్ కొద్ది వ్యూస్ వచ్చాయి. మరోసారి మహేశ్‌బాబు అన్నకూతురు కుర్చీని మడతపెట్టడంతో అభిమానులు లైక్స్ కొడుతూ షేర్ చేస్తున్నారు. కాగా.. ఘట్టమనేని భారతి ఫారిన్‌లో చదువుతున్నట్లు తెలుస్తోంది.
మహేశ్‌బాబు అన్న రమేశ్‌బాబు కూడా తన తండ్రితో కలిసి పలు సినిమాల్లో నటించారు. చివరగా ఎన్‌కౌంటర్ సినిమాలో తండ్రి కృష్ణతో కలిసి కనిపించారు. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇక తర్వాత మహేశ్‌బాబుతో కలిసి అర్జున్, అతిథి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు రమేశ్‌బాబు.