రాజ్ లేని లైఫ్‌లో నేను ఉండలేదు: లావణ్య
టాలీవుడ్ హీరో రాజ్‌తరుణ్, లావణ్య ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది.
By Srikanth Gundamalla Published on 13 July 2024 3:25 AM GMTరాజ్ లేని లైఫ్‌లో నేను ఉండలేదు: లావణ్య
టాలీవుడ్ హీరో రాజ్‌తరుణ్, లావణ్య ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. రాజ్‌తరుణ్ తనని మోసం చేశాడంటూ లావణ్య ఆరోపిస్తోంది. ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే.. రాజ్‌తరుణ్ మాత్రం అదంతా ఒకప్పుడు ఉండేదనీ.. తాను దూరంగా ఉంటున్నట్లు పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా శుక్రవారం అర్ధరాత్రి లావణ్య సంచలన మెసేజ్ చేసింది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ అడ్వొకేట్‌కు మెసేజ్ పంపించింది. తాను వెళ్లిపోతున్నట్లు మేసేజ్‌లో పేర్కొంది.
అయితే.. వెంటనే స్పందించిన అడ్వొకేట్ 112 కు డయల్ చేసి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో.. పోలీసులు కూడా వెంటనే స్పందించి లావణ్య ఇంటికి వెళ్లారు. ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిసింది. తానేంటో తెలిసినవారే తనను తప్పుబట్టారని లావణ్య తన మెసేజ్‌లో ఆవేదన వ్యక్తం చేసింది.
అడ్వొకేట్‌కు పంపిన మెసేజ్‌లో లావణ్య ఇలా రాసుకొచ్చింది.. 'రాజ్ లేని లైఫ్‌లో నేను ఉండలేను. బతకలేను. అన్నీ కోల్పోయాను. అందరి వల్ల నేనే మోసపోయాను. రాజ్ తల్లిదండ్రులు కూడా నా చావుకి కారణం. రాజ్ మొత్తం మారిపోయాడు. నా చావుని కోరుకున్నాడు. మాల్వీ మల్హోత్రా నా చావుకి ప్రధాన కారణం. నా కుటుంబం, దిలీప్ సుంకర, మీడియాకు నా క్షమాపణలు' అంటూ లావణ్య అడ్వొకేట్‌కు మెసేజ్ పంపించింది.