బిగ్‌బాస్‌-4: ఈ వారం లాస్య ఔట్‌..!

Lasya Eliminated From Bigg Boss 4..బిగ్‌బాస్‌ తెలుగు నాలుగో సీజన్‌ కొనసాగుతోంది. ఇప్పటికే పది వారాలు గడ

By సుభాష్  Published on  22 Nov 2020 9:03 AM IST
బిగ్‌బాస్‌-4: ఈ వారం లాస్య ఔట్‌..!

బిగ్‌బాస్‌ తెలుగు నాలుగో సీజన్‌ కొనసాగుతోంది. ఇప్పటికే పది వారాలు గడిచిపోయాయి. ఇక ఫైనల్‌ కూడా దగ్గరలోనే ఉంది. ప్రతి వారం వచ్చిందంటే ఎవరో ఒకరు హౌస్‌ నుంచి బయటకు వెళ్లిపోవడం ఖాయం. అయితే ఈ వారం ఎలిమినేషన్‌ ఉండబోదనే ప్రచారం కూడా చాలా జరుగుతోంది. ప్రస్తుతం ఓట్ల ప్రకారం పరిశీలిస్తే.. ఖచ్చితంగా ఈ వారం అభిజిత్‌ సేవ్‌ కావడం ఖాయం.ఇక అందరికంటే తక్కువ ఓట్లు ఉన్న కంటెస్టెంట్లు మోనాల్‌, లాస్య. అయితే బిగ్‌బాస్‌ షోను ఒక రోజు ముందుగా షూట్‌ చేస్తారు. అలాగే ఎలిమినేషన్‌ కూడా ఒక రోజు ముందుగానే షో జరిగిపోతుంది. ప్రతి వారం ఎలిమినేట్‌ ఎవరు అవుతారనేది ముందుగానే లీకవుతున్నాయి. ఇప్పటి వరకు అన్ని వారాల్లో కూడా ముందుగా లీకు వీరులతో ఎలిమినేట్‌ ఎవరు అనేది స్పష్టమవుతున్నాయి. ఈ వారం కూడా ఎవరు అనేది ఆయటకు పొక్కిపోయింది.

ఈ వారంలో ఎలిమినేషన్‌లో చోటు చేసుకున్న ట్విస్ట్‌ అంతా ఇంతా కాదు. ఒకరు వెళ్లిపోతారనుకుంటే మరొకరు ఎలిమినేట్‌ కావడం అనుకోని ట్విస్ట్‌గా మారింది. ఊహించని కంటెస్టెంట్లు హఠాత్తుగా బ్యాగు సర్దుకుని ఇంటి దారి పట్టడం వంటివి ఎన్నో చూస్తూనే ఉన్నాయి. ఈవారం కూడా అదే జరిగింది. అసలు ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఉత్కంఠగా మారింది. ఈ వారం అభిజిత్‌, హరియానా, సోహెల్‌, మోనాల్‌, హారిక, లాస్యలు నామినేషన్‌లో ఉన్నారు. నిన్న జగిరిన షోలో మొదట సోహెల్‌ సేవ్‌ అయ్యాడు. ఈ వారం ఖచ్చితంగా మోనాల్‌ వెళ్లిపోతుందని అందరి భావించారు. కానీ అనధికారిక ఓట్ల ప్రకారం పరిశీలిస్తే.. అందుకు భిన్నంగా ఉంది.

అయితే ఇందులో భాగంగా యాంకర్‌ లాస్య ఎలిమినేట్‌ అయినట్లు సమాచారం. లాస్య హౌస్‌లో అందరికి వంట వండి పెడుతూ తన జీవితంలోని కష్టనష్టాలను తెలియజేస్తూ అందరిని కంటతడి పెట్టించిన ఆమె.. ఈ రోజు ఎపిసోడ్‌లో కన్నీటితో బిగ్‌బాస్‌కు వీడ్కోలు పలకనున్నట్లు సమాచారం. ఇక ఎక్కువగా ఓట్లు అంటే అభిజిత్‌కే ఉన్నాయి. ఈ మధ్య అభిజిత్‌కు ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ పెరిగిపోయింది. ఎందుకంటే సోహెల్‌, అఖిల్‌ కారణంగా అంతని ఫాలోయింగ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. చివరి నిమిషంలో మోనాల్‌ కాస్త కొన్ని ఓట్లతో ముందుకెళ్లిందని, దాంతో ఈవారం లాస్య ఇంటి నుంచి బయటకు వెళ్లిపోనుందని సమాచారం. లాస్యకు సొంత ఫాలోయింగ్‌ తప్ప ఇతరులు పెరిగింది ఏమి లేదు. హౌస్‌లో సేప్‌ గేమ్‌ ఆడుతూ, ఎవరి విషయంలో జోక్యం కలిగించుకోకుండా తెలివిగా గేమ్‌ ఆడుతున్నారని ఇంటి సభ్యులతో పాటు బయటకు ప్రేక్షకుల వాదన. మరీ ఇందులో ఎంత వరకు నిజం అనేది అధికారికంగా తెలియాలంటే ఈ రాత్రి వరకు ఆగాల్సిందే.

Next Story