రాజ్ తరుణ్‌లో మ్యాటర్ లేదంటూ యువతి సంచలన వీడియో.. మూవీ ప్రమోషనా?
టాలీవుడ్ హీరో రాజ్‌తరుణ్ పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన వార్త కొద్ది రోజులుగా ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 19 Aug 2024 11:16 AM ISTరాజ్ తరుణ్‌లో మ్యాటర్ లేదంటూ యువతి సంచలన వీడియో.. మూవీ ప్రమోషనా?
టాలీవుడ్ హీరో రాజ్‌తరుణ్ పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన వార్త కొద్ది రోజులుగా ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. తనని ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఆ తర్వాత ఇష్యూ పెద్దది అయ్యింది. రాజ్‌తరుణ్ మాత్రం తనకు.. లావణ్యకు మధ్య ఇప్పుడెలాంటి సంబందం లేదని చెబుతూనే ఉన్నాడు. ఇక ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లావణ్య కేసుతో సతమతం అవుతున్న రాజ్‌తరుణ్‌పై ఓ యువతి సంచలన కామెంట్స్ చేసింది. అతని పేరు ప్రస్తావించకుండా అతడి సినిమాలతో ఆ హీరో మగాడే కాదంటూ వీడియో పోస్టు చేసింది.
హీరో గురించి జరుగుతున్న రచ్చ చూస్తున్నా అని పేర్కొంది ఆ యువతి. హీరో చూడటానికి బాగుంటాడు కానీ.. అతనికి మ్యాటరే లేదని చెప్పింది. మ్యాటర్ లేని వ్యక్తి ఇలాంటివి చేశాడంటే నమ్మబుద్ధి కావడం లేదని అంది. తన ఫ్రెండ్‌తో రిలేషన్ షిప్‌లో ఉన్నాడనీ.. వారిద్దరూ ఎప్పుడూ కలిసినట్లు ఫ్రెండ్ చెప్పలేదని పేర్కొంది. తన ఫ్రెండ్ ఎప్పడూ కాల్ చేసి దూరం ఉంచుతున్నాడని ఏడ్చేదని తెలిపింది. అందుకే రాజ్ తరుణ్ సినిమాలో మాత్రమే హీరో.. బయట జీరో అంటూ సంచలన కామెంట్ చేసింది. ఏది ఏమైనా దీనిపై మరిన్ని విషయాలను ఆధారాలతో ఆగస్టు 19న చెబుతానని వెల్లడించింది. అయితే.. సంయుక్త అనే పేరుతో మాట్లాడిన ఈ యువతి.. ముఖం కనిపించకుండా స్కార్ఫ్ కట్టుకుంది.
ఇదంతా కూడా కొత్తగా రాబోయే సినిమా "భలే ఉన్నాడే"కు సంబంధించిన ప్రమోషన్‌లో భాగంగా చేసిందే. తన చుట్టూ అల్లుకున్న వివాదాలను కూడా ఈసారి సినిమా ప్రమోషన్‌కు వాడేయాలని చూస్తున్నారు రాజ్‌తరుణ్. రాజ్ తరుణ్ హీరోగా, మనీషా కంద్కూర్ హీరోయిన్‌గా రూపుదిద్దుకుంటున్న 'భలే ఉన్నాడే' చిత్రం సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.