ఓటీటీలోకి వచ్చేస్తున్న 'ఖుషీ' సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
బిగ్‌స్క్రీన్ పై అలరించిన ఖుషీ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది.
By Srikanth Gundamalla Published on 24 Sept 2023 11:15 AM IST
ఓటీటీలోకి వచ్చేస్తున్న 'ఖుషీ' సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఖుషీ సినిమా. ఈ మూవీకి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 1న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మంచి ఓపెనింగ్స్‌ను అందుకుంది. విజయ్, సామ్ ఆన్‌స్క్రీన్ కెమెస్ట్రీకి ప్రేక్షకులు అంతా ఫిదా అయిపోయారు. అద్భుతమైన విజువల్స్‌కి తోడు.. మంచి పాటలతో సినిమా ప్రేక్షకులను మెప్పించిందనే చెప్పాలి. అదిరిపోయే బీజీఎం సినిమాలో కీలక పాత్ర పోషించాయి. అయితే.. బిగ్‌స్క్రీన్ పై అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది.
విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన ఈ సినిమాపై రిలీజ్‌కు ముందు నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక సాంగ్స్ అయితే మరింత హైప్‌ను పెంచేశాయి. దాంతో ప్రీరిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ముఖ్యంగా డిజిటల్ రైట్స్ కోసం పలు ఓటీటీ సంస్థలు పోటీ పడ్డాయట. చివరకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీని కొనుగోలు చేసింది. అక్టోబర్ 1 నుంచి ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలిపింది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై పలు రూమర్స్ వస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. నిడివి కారణంగా కట్ చేసిన కొన్ని సన్నివేశాలను కూడా యాడ్ చేశారట. విజయ్, సామ్ రొమాంటిక్ సీన్స్ చూపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో.. ఓటీటీలో మరోసారి సినిమాను వీక్షించేందుకు ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
పెళ్లి తర్వాత జీవితం గురించి సాగుతుంది ఈ ఖుషీ సినిమా కథ. పెద్దలు అడ్డు చెప్పినా పెళ్లి చేసుకుంటారు. వీళ్లు విడిపోవడం ఖాయమని పెద్దలు అనుకుంటారు. మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. పెద్దలు చెప్పినట్టే విడిపోయిందా? ఇంతకీ వీళ్ల కుటుంబాల కథేమిటి?పెళ్లి తర్వాత విప్లవ్ (విజయ్), ఆరాధ్య (సమంత) మధ్య ఎలాంటి సమస్యలు వచ్చాయి..? అనే ఆసక్తికర అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది.
#Kushi will be streaming from Oct 1 on NETFLIX. pic.twitter.com/03emyGLAgF
— Christopher Kanagaraj (@Chrissuccess) September 24, 2023