యాదాద్రిలో స్వామివారిని దర్శించుకున్న "ఖుషి" మూవీ టీమ్

టాలీవుడ్ రీసెంట్ సూపర్ హిట్ ఖుషి మూవీ టీమ్ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు.

By Srikanth Gundamalla
Published on : 3 Sept 2023 10:04 AM

Kushi, Movie Team,  Yadadri Temple, Vijay Devarakonda,

యాదాద్రిలో స్వామివారిని దర్శించుకున్న "ఖుషి" మూవీ టీమ్

టాలీవుడ్ రీసెంట్ సూపర్ హిట్ ఖుషి మూవీ టీమ్ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఖుషి సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవి శంకర్ తమ కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ... మా ఖుషి సినిమాకు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ఆడియెన్స్ కు థాంక్స్ చెబుతున్నామని అన్నారు. ఖుషీ సినిమా ఘన విజయం దక్కిన నేపథ్యంలో మూవీ టీమ్ అంతా కలిసి సకుటుంబంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చామని తెలిపారు. యాదాద్రి ఆలయాన్ని ప్రపంచ ప్రఖ్యాత దేవాలయంగా తీర్చిదిద్దిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. యాదాద్రిలో నిర్మాణాలు, ఇక్కడ ఏర్పాటు చేసిన సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. ఖుషి సినిమా దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాతలు వై రవి శంకర్, నవీన్ యెర్నేని యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Next Story