'ఖుషీ'పై విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్టు

ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 1న విడుదలైన 'ఖుషీ' సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వస్తోంది.

By Srikanth Gundamalla  Published on  1 Sept 2023 12:33 PM IST
Kushi Movie,  Vijay Devarakonda, Emotional Tweet,

'ఖుషీ'పై విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్టు

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా నటించిన 'ఖుషీ' సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో వెయిట్‌ చేశారు. ఎప్పుడు థియేటర్లలో చూద్దామా అన్నట్లుగా ఎదురు చూశారు. ఖుషీ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, పాటలు అయితే సినిమాపై ఆడియన్స్‌లో మరింత ఇంట్రెస్ట్‌ను పెంచింది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఖుషీ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. గతంలో ఆయన మంచి హిట్‌ సాధించిన నిన్నకోరి, మజిలీ సినిమాలకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 1న విడుదలైన 'ఖుషీ' సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వస్తోంది. ఖుషి పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని, ప్రేక్షకులను ఎంగేజింగ్ చేయడంలో శివనిర్వాణ కథ, కథనం కీలక పాత్ర పోషించాయని సోష‌ల్ మీడియాలో నెటిజెన్లు అంటున్నారు. విజయ్‌ నుంచి గీత గోవిందం తర్వాత మళ్లీ అలాంటి సూపర్ హిట్ సినిమా ఇదేన‌ని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి వ‌స్తున్న స్పంద‌న ప‌ట్ల విజ‌య్ దేవ‌ర‌కొండ సోష‌ల్ మీడియాలో ఓ ఎమోష‌న‌ల్ పోస్టు చేశారు.

అభిమానులతో పాటు తాను కూడా ఐదేళ్లుగా హిట్‌ కోసం వేచి చూస్తున్నానని విజయ్ దేవరకొండ అన్నారు. తన పని తాను చేసి.. ఓపికగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. మొత్తానికి ఇవాళ హిట్‌ కొట్టేశాం అంటూ ఎక్స్‌ (ట్విట్టర్‌)లో రాసుకొచ్చారు. ఆయనకు ఉదయం లేవగానే వందల కొద్ది ఫోన్లు, మెసేజ్‌లు వచ్చాయని అన్నారు. వాటితోనే నిద్రలేచానని అన్నారు. ఆ క్షణంలో కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండలేకపోయానని అన్నారు విజయ్‌ దేవరకొండ. సినిమాను ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. స్నేహితులు, కుటుంబంతో కలిసి ఖుషీ సినిమాకు వెళ్లండని.. థియేటర్లలో ఆనందించండని విజయ్‌ దేవరకొండ పేర్కొన్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై ఖుషీ సినిమా తెరకెక్కింది. తెలుగు, తమిళం, కన్నడ, హిండీ, మలయాళ భాషల్లో విడుదలై.. మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.

Next Story