క్లింకార ఫస్ట్‌ వీడియో షేర్‌ చేసిన రామ్‌చరణ్‌.. నెట్టింట వైరల్

రామ్‌చరణ్‌ క్లింకార సంబంధించిన ఫస్ట్‌ వీడియోను విడుదల చేశారు.

By Srikanth Gundamalla  Published on  20 July 2023 2:45 PM GMT
Klin Kaara, 1st Month, Ramcharan, Video Shared,

 క్లింకార ఫస్ట్‌ వీడియో షేర్‌ చేసిన రామ్‌చరణ్‌.. నెట్టింట వీడియో వైరల్

మెగా పవర్‌ స్టార్ రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులకు చాలా కాలం తర్వాత కూతురు పుట్టిన విషయం తెలిసిందే. పాపకు క్లింకారా అని పేరు కూడా పెట్టారు. గత నెల 20న క్లింకార జన్మించింది. గురువారంతో నెల పూర్తి అవుతుంది. అయితే.. గురువారం రోజే ఉపాసన పుట్టిన రోజు. దీంతో.. మెగా ఫ్యామిలీలో సంబరాలు మిన్నంటాయి. ఈ సంతోషకరమైన రోజు సందర్భంగా రామ్‌చరణ్‌ క్లింకార సంబంధించిన ఫస్ట్‌ వీడియోను విడుదల చేశారు.

ఉపాసన బర్త్‌డే, క్లింకార వన్‌ మంత్‌ యానివర్సరీ సందర్భంగా.. తన కూతురు ఆగమనానాకి సంబంధించి హార్ట్‌ టచింగ్ వీడియోను విడుదల చేశారు రామ్‌చరణ్. ఎనిమిది నెలల ప్రెగ్నెన్సీ జర్నీ తర్వాత అసలు కథ స్టార్ట్ అయిందంటూ.. బేబీ క్లింకారాను తన చేతుల్లోకి తీసుకున్న ఎమోషనల్ మోమెంట్స్ పంచుకున్నారు. ఇటు తన తల్లిదండ్రులు.. అటు ఉపాసన పేరెంట్స్.. మరోవైపు అభిమానుల ఆనందకర క్షణాల గురించి చెప్పుకొచ్చారు. క్లీంకార వన్‌ మంత్‌ బర్త్‌ యానివర్సరీ వీడియోను పాపులర్‌ ఫిల్మ్‌ మేకర్‌ జోసెఫ్ ప్రతనిక్‌ డైరెక్ట్‌ చేసి నిర్మించడం విశేషం. మెగా ఫ్యామిలీ, అటు ఉపాసన పుట్టింటి వారు హ్యాపీమూడ్‌లో ఉన్నారు. అందరి ఆనందోత్సాహాలు వీడియోలో కనిపిస్తున్నాయి.

క్లింకార పుట్టే సమయంలో అందరిలో ఆందోళన ఉండిందని రామ్‌చరణ్‌ అన్నారు. అంతా బాగా జరగాలని తామంతా ప్రార్థించామని చెప్పారు. దేవుడి దయ వల్ల ప్రార్థించినట్లుగానే అన్నీ అనుకూలంగా మారి సరైన సమయంలో క్లింకారా ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టిందని వీడియోలో చెప్పారు రామ్‌చరణ్. పాప పుట్టిన క్షణం నుంచి ఎంతో సంతోషంగా ఉన్నానని .. కుటుంబం కూడా ఆనందంలో మునిగిపోయిందని చెప్పుకొచ్చారు. ఇలా కూతురు పుట్టిన సంతోషాన్ని భావోద్వేగపూరిత క్షణాలతో ఉన్న వీడియోను అందరితో పంచుకున్నారు రామ్‌చరణ్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు, అభిమానులు కూడా ఎమోషనల్ అవుతున్నారు. అటు ఉపాసనకు, ఇటు క్లింకారను విష్‌ చేస్తున్నారు.


Next Story