హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి డేట్ ఫిక్స్!
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం కొంతకాలం ముందు తన సినిమా హీరోయిన్‌తోనే నిశ్చితార్థం చేసుకున్నాడు.
By Srikanth Gundamalla Published on 20 Aug 2024 6:01 PM ISTహీరో కిరణ్ అబ్బవరం పెళ్లి డేట్ ఫిక్స్!
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం కొంతకాలం ముందు తన సినిమా హీరోయిన్‌తోనే నిశ్చితార్థం చేసుకున్నాడు. కిరణ్ అబ్బవరం, నటి రహస్య గోరక్ చాలా కాలంగా రహస్యంగానే ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు సంబంధించిన వార్తలు కొన్ని బయటకు వచ్చినా వారు ఎప్పుడూ స్పందించలేదు. కానీ.. మార్చి 13న హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో ఏకంగా ఎంగేజ్‌మెంట్ చేసుకుని షాక్ ఇచ్చారు. ఇప్పటికే ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే.. నిశ్చితార్థం అయినప్పటి నుంచి వీరిద్దరి పెళ్లి ఎప్పుడు ఉంటుందా అనే చర్చ జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది.
తాజా అప్‌డేట్ ప్రకారం ఆగస్టు 22న కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ పెళ్లికి ముహూర్తం ఖరారైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కిరణ్ అబ్బవరం కుటుంబసభ్యులు త్వరలోనే వెల్లడించనున్నారని సమాచారం. కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ ‘రాజావారు రాణిగారు’ సినిమాలో కలిసి నటించారని తెలిసిందే. తొలి సినిమాతో ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఫైనల్‌గా ఇద్దరూ ఏడడుగులు వేయబోతుండటంతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Young Talent @Kiran_Abbavaram & Actress @rahasya_gorak Got Engaged 💍 Today 💕
— Vamsi Kaka (@vamsikaka) March 13, 2024
Wishing them a lifetime of love and happiness ❤️#KiranAbbavaram #RahasyaGorak pic.twitter.com/arzs5BToWc