హాస్పిటల్ బెడ్‌పై కేజీఎఫ్ నటి

కేజీఎఫ్.. ఈ సినిమా ఒక బ్రాండ్ గా నిలిచింది. సినిమా స్టార్టింగ్ నుండి ఎండ్ వరకూ ఒకే ఇంటెన్సిటీలో సినిమా ముందుకు

By M.S.R
Published on : 13 April 2023 9:30 PM IST

KGF Actress, Malavika Avinash, sandalwood

హాస్పిటల్ బెడ్‌పై కేజీఎఫ్ నటి 

కేజీఎఫ్.. ఈ సినిమా ఒక బ్రాండ్ గా నిలిచింది. సినిమా స్టార్టింగ్ నుండి ఎండ్ వరకూ ఒకే ఇంటెన్సిటీలో సినిమా ముందుకు సాగుతుంది. సినిమా కథను మొదలుపెట్టేది ఒక మహిళా జర్నలిస్ట్ అనే సంగతి అందరికీ తెలిసిందే..! ఆ నటి మరెవరో కాదు మాళవిక అవినాష్. ఇప్పుడు ఆమె ఆసుపత్రి పాలయ్యారు. ఆమె ఆసుపత్రి బెడ్ మీద ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

ఎవరికైనా మైగ్రేన్‌ సమస్య ఉంటే దాన్ని తక్కువ చేసి చూడకండని ఆమె అన్నారు. తలనొప్పిని తేలికగా తీసుకోవద్దని అలా తీసుకుంటే నాలాగా హాస్పిటల్ పాలవుతారని ఆమె చెప్పారు. మైగ్రేన్‌ సమస్య నుంచి బయటపడేందుకు ప్రస్తుతం పనాడోల్, నెప్రోసిమ్‌తో పాటు సంప్రదాయ ఔషధం తీసుకుంటున్నానని వివరించారు. మైగ్రేన్‌ సమస్య ఉన్న వారు కచ్చితంగా డాక్టర్‌ని సంప్రదించాలని సూచించారు.

Next Story