ద‌ర్శ‌కుడిని ప‌రిగెత్తించి కొట్టిన కీర్తిసురేష్.. వీడియో వైర‌ల్‌

Keerthi Suresh Video Viral .. నేనూ శైల‌జ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యమైన న‌టి కీర్తి సురేష్. మ‌హాన‌టి చిత్ర

By సుభాష్  Published on  3 Dec 2020 7:35 AM GMT
ద‌ర్శ‌కుడిని ప‌రిగెత్తించి కొట్టిన కీర్తిసురేష్.. వీడియో వైర‌ల్‌

నేనూ శైల‌జ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యమైన న‌టి కీర్తి సురేష్. మ‌హాన‌టి చిత్రంతో అమ్మ‌డి క్రేజ్ మ‌రింత పెరిగింది. ప్ర‌స్తుతం యంగ్ హీరో నితిన్ స‌ర‌స‌న రంగ్‌దే చిత్రంతో న‌టిస్తుంది. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం దుబాయ్‌లో జ‌రుగుతోంది.

ఇటీవల కీర్తి చైర్ లో రిలాక్స్ అవూతూ తన కళ్లపై ఒక క్లాత్ ని ఉంచి నిద్ర‌పోతుంది. తన వెనకగా వ‌చ్చిన‌ నితిన్ - వెంకీ ఆ దృశ్యాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. దాంతో సెట్‌లో ఎప్పుడూ నిద్ర పోకూడదని తెలుసుకున్నానని కీర్తీ అంది. దానికి ప్ర‌తీకారం తీర్చుకుంటాన‌ని చెప్పింది. అన్న‌ట్లుగా తాజాగా కీర్తి ఓ వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో కీర్తి దర్శకుడు వెంకీను గొడుగు తీసుకొని కొడుతుంది. ప‌గ తీర్చుకుంటున్నా.. అంటూ కామెంట్ చేసింది. నితిన్ ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ ను ట్యాగ్ చేస్తూ.. కీర్తి ఇలా వ్యాఖ్యను జోడించింది.`నా పగ త్వరలో తీర్చేసుకుంటాను` అంటూ క్యాప్షన్ ఇచ్చింది. చూడాలి మ‌రీ నితిన్‌పై కీర్తి ఎలా ప‌గ తీర్చుకుంటుందో.Next Story