'కీడా కోలా' మూవీ టీమ్ ఆఫర్.. మల్టీప్లెక్సుల్లో రూ.112కే టికెట్

మల్టీప్లెక్సుల్లో రూ.112కే టికెట్ విక్రయించనున్నట్లు 'కీడా కోలా' మూవీ టీమ్‌ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది.

By Srikanth Gundamalla  Published on  7 Nov 2023 8:00 PM IST
keedaa cola, movie team, offer, rs.112 multiplex ticket,

'కీడా కోలా' మూవీ టీమ్ ఆఫర్.. మల్టీప్లెక్సుల్లో రూ.112కే టికెట్

చాలా వరకు సినిమా ప్రేక్షకులు మల్టీప్లెక్సుల్లో సినిమా చూడ్డానికి వెనకాడతారు. ఎందుకంటే అక్కడ టికెట్‌ కాస్ట్‌ అలా ఉంటుంది. అలా ఎక్కువ డబ్బులు వెచ్చించకుండా తక్కువ ధరకే మల్టీప్లెక్సుల్లో సినిమా టికెట్‌ లభిస్తుందంటే.. అవును ఈ ఆఫర్ 'కీడా కోలా' మూవీ టీమ్‌ ప్రకటించింది. తమ సినిమా టికెట్‌ మల్టీప్లెక్స్‌ల్లో రూ. 112కే లభిస్తుందని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది.

అయితే.. షరతులు వర్తిస్తాయని కూడా కీడా కోలా మూవీ టీమ్‌ పేర్కొంది. రెక్లైనర్స్‌కు ఈ ఆఫర్‌ వర్తించడని చెప్పింది. దాంతో.. తెలంగాణలోని మల్టీప్లెక్సుల్లో మాత్రమే ఈ ఆఫర్‌ అమల్లో ఉండనుంది. బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడ్రోజుల పాటు సినిమా ప్రేక్షకులు తమ సినిమాను కేవలం రూ.112కే మల్టీప్లెక్సుల్లో వీక్షించేందుకు అవకాశం ఇచ్చింది.

కాగా.. ఈ మూవీని తరుణ్‌ బాస్కర్‌ స్వీయ దర్శకత్వంలో నటించి తెరకెక్కించారు. మూవీలో తరుణ్‌ భాస్కర్‌తో పాటు చైతన్యరావు, రాగ్‌ మయూర్, బ్రహ్మానందం, జీవన్‌ కుమార్ సహా తదితరులు నటించారు. ప్రముఖ హీరో రానా దగ్గుబాటి సమర్పకుడిగా వ్యవహరించారు. క్రైమ్‌ కామెడీ నేపథ్యంలో నవంబర్ 3న ఈ సినిమా ప్రేక్షకుల మందుకు వచ్చింది. ఇప్పటికే థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ మూవీ.. తాజాగా ఈ ఆఫర్‌తో మరింత చేరువ కానుంది.

Next Story