ఎప్పుడూ అలా అనలేదు..అదొక పుకారు: బలగం హీరోయిన్ కావ్య
బాడీషేమింగ్ గురించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని కావ్య కళ్యాణ్‌రామ్ చెప్పింది.
By Srikanth Gundamalla Published on 12 July 2023 9:34 PM ISTఎప్పుడూ అలా అనలేదు..అదొక పుకారు: బలగం హీరోయిన్ కావ్య
చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండి తెరకు పరిచయమై.. ఆ తర్వాత హీరోయిన్‌గా కొందరు మాత్రమే రాణిస్తారు. వారిలో ఒకరే కావ్య కళ్యాణ్‌రామ్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా 'గంగోత్రి', 'ఠాగూర్', 'అడవి రాముడు' చిత్రాల్లో నటించి అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం హీరోయిన్‌గా కూడా సినిమాలు చేస్తుంది. హీరోయిన్‌గా హారర్ చిత్రం 'మసూద' ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హిట్ అయినా కూడా హారర్ జానర్ కావడంతో.. కావ్యకు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ.. ఇటీవల వచ్చిన 'బలగం' సినిమా పెద్ద హిట్ సాధించింది. కావ్య కళ్యాణ్ రామ్‌కు కూడా మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. అయితే..
బాడీ షేమింగ్ విషయంలో కొంతమంది డైరెక్టర్స్ ధోరణి తనని చాలా బాధపెట్టిందని కావ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా రీసెంటుగా ఒక పుకారు షికారు చేయడం మొదలుపెట్టింది. దీంతో.. ఈ పుకారుపై స్పందించింది కావ్య. అలా తను ఎప్పుడూ అనలేదుని.. అదొక పుకారు మాత్రమే అని కొట్టి పారేసింది. తప్పుడు కథనాలను ఎవరూ నమ్మొద్దని కోరంది. అలాగే.. ఏవీ తెలియకుండా తప్పుడు వార్తలను కూడా ప్రచారం చేయొద్దని కావ్య కళ్యాణ్ రామ్ విజ్ఞప్తి చేసింది. ఆమె ఈ విధంగా పెట్టిన పోస్టుకు నెటిజన్లు కూడా మద్దతు తెలుపుతున్నారు.
ప్రస్తుతం కావ్య నటించిన ‘ఉస్తాద్’ (Ustaad) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో కీరవాణి తనయుడు శ్రీసింహా (Sri Simha) హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగానే కావ్య బాడీ షేమింగ్‌పై వ్యాఖ్యలు చేసిందని పుకార్లు వచ్చాయి. ‘ఉస్తాద్’ చిత్రాన్ని రజినీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 12న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.