20 కోట్లు ఇస్తాను.. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగిన మహిళా అభిమాని

Kartik Aaryan's fan offers Rs 20 crore to marry her. అభిమానుల హృదయాలను ఎలా గెలుచుకోవాలో బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌కు ఖచ్చితంగా తెలుసు. ఒక మహిళా అభిమాని

By M.S.R  Published on  11 March 2022 10:00 AM IST
20 కోట్లు ఇస్తాను.. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగిన మహిళా అభిమాని

అభిమానుల హృదయాలను ఎలా గెలుచుకోవాలో బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌కు ఖచ్చితంగా తెలుసు. ఒక మహిళా అభిమాని తనను పెళ్లి చేసుకోవాలని కార్తీక్ ను అడిగింది. అందుకు అతడు చెప్పిన సమాధానం అందరినీ ఆకట్టుకుంటూ ఉంది. లూడో సినిమా ఫేమ్ బాల నటుడు ఇనాయత్ వర్మతో కలిసి కార్తీక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోకు భారీగా లైక్స్ వచ్చాయి. ఎంతోమంది కామెంట్స్ కూడా చేశారు.

ఓ మహిళా అభిమాని మాత్రం ఒక ఆసక్తికర ప్రతిపాదనను పెట్టింది. వీడియో కామెంట్స్ విభాగంలో, ఆమె రూ. 20 కోట్లకు బదులుగా తనను వివాహం చేసుకోమని కార్తీక్ ఆర్యన్‌ను కోరింది. 'అచ్ఛా ముజ్సే షాదీ కర్లో 20 కోట్ల దుంగీ' (నన్ను పెళ్లి చేసుకుంటే రూ. 20 కోట్లు ఇస్తాను) అని ఆ అభిమాని రాసింది. కార్తీక్ తనదైన శైలిలో, "కబ్ (ఎప్పుడు)" అని బదులిచ్చాడు. మహిళా అభిమానికి నటుడి రిప్లై చూసి అభిమానులు తెగ నవ్వుకుంటూ ఉన్నారు. బాలీవుడ్ హీరోలలో కార్తీక్ ఆర్యన్ కు మహిళా అభిమానుల ఫాలోయింగ్ ఒక రేంజిలో ఉంటుంది. గతంలో పలువురు అమ్మాయిలు కార్తీక్ ఉండే అపార్ట్మెంట్ ముందుకు వచ్చి.. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. 'బయటకు రా కార్తీక్.. నేను నిన్ను ప్రేమిస్తున్నాను' అంటూ అభిమానులు సందడి చేస్తూ వచ్చారు.



Next Story