మంచు విష్ణు 'కన్పప్ప' ప్రాజెక్టులోకి కన్నడ సూపర్ స్టార్
మంచు విష్ణు హీరోగా ఎంతో పతిష్టాత్మక చిత్రంగా రూపొందుతున్న సినిమా భక్త 'కన్నప్ప'.
By Srikanth Gundamalla Published on 12 Oct 2023 5:45 PM ISTమంచు విష్ణు 'కన్పప్ప' ప్రాజెక్టులోకి కన్నడ సూపర్ స్టార్
మంచు విష్ణు హీరోగా ఎంతో పతిష్టాత్మక చిత్రంగా రూపొందుతున్న సినిమా భక్త 'కన్నప్ప'. ఈ సినిమాను మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో పెద్ద పెద్ద స్టార్లు కనిపించనున్నారని.. అంచనాలను పెంచేశారు. తాజాగా మరో విషయం తెలిపింది. ఈ భారీ బడ్జెట్ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ కూడా భాగం కానున్నారని తెలిపింది. ఈ మేరకు చిత్రబృందం ప్రకటన చేసింది. దాంతో.. భక్తకన్నప్ప సినిమాపై ప్రేక్షకుల్లో మరింత హైప్ పెరిగింది.
భక్తిరస పౌరాణిక చిత్రం 'కన్నప్ప' షూటింగ్ న్యూజిలాండ్ లో మొదలైన సంగతి తెలిసిందే. 'మహా భారతం' సిరీస్ కి దర్శకత్వం వహించిన ముకేశ్ కుమార్ సింగ్ ఈ 'కన్నప్ప' సినిమాకి దర్శకుడు. ఒక్కో భాష నుండి ఒక్కో సూపర్ స్టార్ ఈ సినిమాలో నటిస్తున్నారు అని వార్తలు రావటంతో ఈ సినిమా మీద ఇప్పుడు భారీ అంచనాలు పెరిగాయి. ఇప్పటికే ఈ మూవీలో ప్రభాస్-నయనతారలు శివపార్వతులుగా కనిపించనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మంచు విష్ణు కూడా పరోక్షంగా ఖరారు చేశారు. మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ ఇందులో భాగమయ్యారు. తాజాగా కన్నడ అగ్ర హీరో శివరాజ్‌కుమార్ ఈ సినిమాలో నటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు పెట్టింది. శివరాజ్‌కుమార్ కన్నప్ప సినిమాలో భాగం కావడం ఎంతో గౌరవంగా భావిస్తున్పట్లు చిత్రబృందం పేర్కొంది. ‘ఆయనే సర్వం..ఆయనే విశ్వం’ అంటూ హర హర మహాదేవ అనే హ్యాష్ ట్యాగ్‌ను జోడించింది. అయితే, ఆయన ఏ పాత్రలో కనిపించనున్నారని మాత్రం ప్రకటించలేదు. కాగా.. శివరాజ్‌కుమార్ 1988లో కన్నడలో భక్త కన్నప్ప సినిమా తెరకెక్కింది. విజయాన్ని అందుకుంది. అప్పటి పోస్టర్‌ను కూడా మంచు విష్ణు తాజాగా పోస్టు చేశారు.
Har Har Mahadev ❤️ https://t.co/liGw4R0Rxv
— Vishnu Manchu (@iVishnuManchu) October 12, 2023