కలెక్షన్స్‌లో దూసుకెళ్తున్న 'కల్కి 2898 ఏడీ'.. ఇప్పటి వరకు..

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సినిమా కల్కి 2898 ఏడీ థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

By Srikanth Gundamalla
Published on : 4 July 2024 10:48 AM IST

kalki, movie collections,  Prabhas, nag Ashwin ,

కలెక్షన్స్‌లో దూసుకెళ్తున్న 'కల్కి 2898 ఏడీ'.. ఇప్పటి వరకు.. 

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సినిమా కల్కి 2898 ఏడీ థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. విజువల్స్‌ మాత్రం వేరే లెవల్ అంటున్నారు సినిమా ప్రేక్షకులు. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్లలో దూసుకెళ్తోంది. కోట్ల రూపాయలను కొల్లగొడుతోంది. ఇప్పటి వరకు కల్కి మూవీ 700 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌ కాస్త ఆసక్తికరంగా ఉంది. హీరో ప్రభాస్ లేకుండా దీపికా పదుకొణె మాత్రమే ఉన్నారు. ఆమె లుక్‌ను హైలైట్ చేశారు. మైథాలజీ సైన్స్‌ ఫిక్షన్‌ గా వచ్చిన ఈ కల్కి మూవీ త్వరలోనే వెయ్యి కోట్ల రూపాయల క్లబ్‌లో కూడా చేరబోతుందని ప్రభాస్‌ ఫ్యాన్స్ దీమా వ్యక్తం చేస్తున్నారు.

జూన్ 27వ తేదీన కల్కి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగ్‌ అశ్విన్‌ తన కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లాడు. ఈ సినిమాలో అగ్రనటులు ఉన్నారు. అమితాబ్‌ బచ్చన్ అశ్వాత్థామ క్యారెక్టర్‌లో అదరగొట్టారు. కల్కి పార్ట్‌ వన్‌కే ఆయన హైలైట్‌గా నిలిచారు. ఇక విలన్ పాత్రలో కమల్‌ హాసన్ నటించారు. సుప్రీం యాస్కిన్‌గా ఆకట్టుకున్నారు. విజయ్‌ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్‌ ఠాకూర్, డైరెక్టర్లు రాజమౌళి, ఆర్‌జీవీ కూడా కనిపించారు. బౌంటీ ఫైటర్‌ భైరవగా ప్రభాస్‌ కనిపించాడు. చివరలో కర్ణుడిగా కనిపించి.. పార్ట్‌-2పై మరిన్ని అంచనాలను రేకెత్తేలా చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. యాస్కిన్‌ పాత్రకూ సీక్వెల్‌లో నిడివి ఎక్కువగా ఉండనుంది సమాచారం. సినీ ప్రముఖులు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story