'కల్కి 2898 ఏడీ' ట్రైలర్ అదిరిపోయిందిగా..!
రెబల్ స్టార్ కల్కి 2898 ఏడి సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
By Srikanth Gundamalla Published on 10 Jun 2024 8:01 PM IST'కల్కి 2898 ఏడీ' ట్రైలర్ అదిరిపోయిందిగా..!
రెబల్ స్టార్ ప్రభాస్ కొత్తగా నటించిన చిత్రం కల్కి 2898 ఏడి. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మహానటి దర్వకుడు అశ్విన్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. సైన్స్‌ఫిక్షన్ ప్రాజెక్టుగా వస్తోన్న కల్కి మూవీపై టాలీవుడ్‌లోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఆసక్తి ఉంది. 27న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీభాషల్లో ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక మూవీ యూనిట్ ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయారు.
కల్కి సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు.. టీజర్లు మూవీపై మరింత ఆసక్తిని పెంచాయి. ఇక కల్కి నుంచి ట్రైలర్ ఎప్పుడొస్తుందా అని అంతా ఎదురు చూశారు. తాజాగా చిత్ర యూనిట్ కల్కి మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేసింది. హాలీవుడ్ రేంజ్‌లో సీన్స్ కనిపించాయి. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ను ట్రైలర్లో మొదటగా చూపించారు. ప్రభాస్ మాత్రం మరోసారి ఇరగదీశాడని అంటున్నారు అభిమానులు. విజువల్స్ వండర్‌గా అనిపించాయనీ చెబుతున్నారు. సైన్స్‌ఫిక్షన్ మూవీలో మొదటిసారి కనపడుతున్న ప్రభాస్.. కచ్చితంగా పెద్ద హిట్ కొడతాడని చెబుతున్నారు.
ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొణె, దిశాపఠాని ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటించారు. లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, రాజేంద్ర ప్రసాద్, పశుపతి కూడా కీలక పాత్రల్లో నటించారు. ట్రైలర్‌ను చూసిన తర్వాత అభిమానులు ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు. ఇంకొందరైతే ట్రైలర్‌ను ఒకటికి నాలుగు సార్లు చూస్తున్నారు.