‘కల్కి 2898 ఏడీ’ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ అధికారిక ప్రకటన

అనుకున్నట్లుగా ఆగస్టు 23న కాదు ఒక రోజు ముందే ‘కల్కి 2898 ఏడీ’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

By Srikanth Gundamalla
Published on : 17 Aug 2024 10:15 AM IST

kalki-2898 AD movie, ott release date, amazon prime,

‘కల్కి 2898 ఏడీ’ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ అధికారిక ప్రకటన 

రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సూపర్‌ హిట్‌ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లను రాబట్టింది. ప్రేక్షకులను అలరించింది. మొత్తంగా రూ.1200 కోట్ల మేర వసూళ్లను రాబట్టిందని చెప్పారు. అయితే.. ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ఓటీటీలో ఎప్పుడు విడుదల అవుతుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. థియేటర్లలో చూసినా కూడా.. మరోసారి ఓటీటీలో చూస్తే బాగుండని అనుకుంటున్నారు. అయితే..ఈ మూవీ ఆగస్టు మూడో వారంలో ఓటీటీలోకి వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఆగస్టు 23న స్ట్రీమింగ్ అవుతుందనే ప్రచారం జరిగింది. తాజాగా చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేశారు.

అనుకున్నట్లుగా ఆగస్టు 23న కాదు ఒక రోజు ముందే ‘కల్కి 2898 ఏడీ’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. స్ట్రీమింగ్ తేదీపై క్లారిటీ ఇచ్చింది. ఇక హిందీ వెర్షన్‌ మాత్రం అదే తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఈ సినిమాలో భవిష్యత్, భూత కాలాల్ని చూపించారు. అలానే మహాభారతం ఎపిసోడ్ కూడా జనాల్ని బాగా ఆకట్టుకుంది. ఆలోవర్ సూపర్‌ హిట్‌గా విజయాన్ని సాధించింది. మరి ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో చూడాలి. ఈ మూవీలో కమల్‌ హాసన్, అమితాబ్‌ బచ్చన్‌ వంటి సూపర్‌ స్టార్స్‌ నటించారు. అంతేకాదు.. స్పెషల్ క్యారెక్టర్స్‌లో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ థాకూర్ సహా మరికొందరు కనిపించారు. ముఖ్యంగా బుజ్జి వాహనానికి కీర్తి సురేశ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడం హైలెట్‌గా నిలిచింది.


Next Story